విద్యుత్ అవసరం లేకుండా మొబైల్, లాప్టాప్ లకు చార్జింగ్ పెట్టవచ్చు.. ఎలాగో తెలుసా..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి చిన్న పనికి కూడా మిషన్లు తయారు చేయడం వల్ల విద్యుత్ వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు కూడా విద్యుత్ చార్జీలు పెంచుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంట్లో లాప్టాప్, మొబైల్, ట్యాబ్ వంటి వాటికి మన ప్రతిరోజు చార్జింగ్ పెట్టవలసి ఉంటుంది. అయితే వీటికి చార్జింగ్ పెట్టడానికి ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. దీంతో కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది. అయితే ఇకపై కరెంటు అవసరం లేకుండా మొబైల్ లాప్టాప్ కి ఛార్జింగ్ పెట్టి పరికరం అందుబాటులోకి వచ్చింది. ఆ పరికరం మరేమిటో కాదు సోలార్‌ పవర్‌ బ్యాంక్‌.

విద్యుత్ అవసరం లేకుండా కేవలం సూర్యకిరణాల వల్ల ఈ సోలార్ పవర్ బ్యాంక్ ఉపయోగించి మొబైల్ లాప్టాప్ చార్జింగ్ పెట్టవచ్చు. ఈ సోలార్ పవర్ బ్యాంక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల పవర్ బ్యాంకులో అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిని చార్జింగ్ పెట్టడానికి కరెంటు అవసరం. వీటిని చార్జింగ్ పెట్టుకుని మొబైల్ లాప్టాప్ అంటే వాటిలో చార్జింగ్ అయిపోయిన తర్వాత ఈ పవర్ బ్యాంకు ద్వారా వాటిని చార్జ్ చేయవచ్చు. అయితే ఇక ఫోన్ లాప్టాప్ వంటి పార్టీకి చార్జింగ్ పెట్టి పవర్ బ్యాంకు కి కరెంటు అవసరం లేకుండా సూర్య కిరణాలు ద్వారా ఛార్జ్ చేయవచ్చు.

కరెంటు లేకపోయినా కూడా మొబైల్ లాప్టాప్ వంటి వాటికి ఛార్జింగ్ పెట్టి ఈ సోలార్ పవర్ బ్యాంక్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ సోలార్ పవర్ బ్యాంక్ ఖరీదు కూడా చాలా తక్కువ. సామాన్య ప్రజలు కూడా కొనగలిగే ఖరీదులో కేవలం రూ.2000 కే ఇది మనకి లభిస్తుంది. ఇది చూడటానికి సాధారణ పవర్ బ్యాంక్ లాగా ఉంటుంది. కానీ ఇది సూర్యని వేడిని గ్రహిస్తుంది. దీనిపై ఉండే సోలార్ ప్యానెల్‌ వల్ల స్మార్ట్‌ ఫోన్‌లు, టాబ్లెట్‌ లు, ల్యాప్‌ టాప్‌లకి అవసరమయ్యే విద్యుత్‌ని సేకరించుకుంటుంది. తర్వాత దీనిని ఛార్జింగ్‌ కోసం ఉపయోగించు కోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ సాధారణ పవర్ బ్యాంక్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. కానీ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఇది చాలా తక్కువ ధర తో అందుబాటులో ఉంటుంది.