సాధారణంగా ఏటీఎంలలో ఏటీఎం కార్డు పిన్ వరుసగా మూడుసార్లు తప్పుగా ఎంటర్ చేయటం వల్ల ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఏటీఎం కార్డు పోగొట్టుకోవడం వల్ల కూడా ఏటీఎం కార్డుని బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా ఒకసారి బ్లాక్ అయిన ఏటీఎం కార్డుని అన్లాక్ చేయడం చాలా సులభం.
• సాధారణంగా ఏటీఎం నుండి డబ్బు విత్ డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు మూడుసార్లు వరుసగా ఏటీఎం పిన్ తప్పుగా ఎంటర్ చేయటం వల్ల ఆ రోజు మొత్తం కార్డు బ్లాక్ అవుతుంది. అయితే అలా జరిగిన 24 గంటల తర్వాత ఏటీఎం కార్డ్ ఆటోమేటిక్ గా అన్ బ్లాక్ అయ్యి యధావిధిగా పనిచేస్తుంది.
• కొన్ని సందర్భాలలో ఏటీఎం కార్డు పోగొట్టుకున్నప్పుడు లేదా మనకు తెలియకుండా మన ఏటీఎం కార్డు నుండి మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు ఏటీఎం కార్డు బ్లాక్ చేయవలసి ఉంటుంది. అటువంటి సమయంలో బ్యాంక్ లో కొత్త ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఐదు నుండి ఏడు రోజుల్లో కొత్త ఏటీఎం కార్డు పొందవచ్చు. అలాగే కొన్ని భద్రతా కారణాల వల్ల ఏటీఎం కార్డ్ బ్లాక్ అయితే సమీపంలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం మీరు మీ ID రుజువును చూపించవలసి ఉంటుంది. తర్వాత బ్యాంక్ మీ దరఖాస్తును 48 గంటల నుంచి ఐదు రోజుల మధ్య ఫార్వార్డ్ చేస్తుంది.
• ఏటీఎం కార్డుకి కూడా కొన్ని సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ గడువు ముగిసిన తర్వాత ఏటీఎం కార్డు ఆటోమేటిగ్గా బ్లాక్ అవుతుంది. అలాంటి సమయంలో దగ్గరలోని బ్రాంచ్ ని సంప్రదించి కొత్త ఏటీఎం కార్డుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కొత్త ఏటీఎం కార్డు ని పొందవచ్చు.