ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్న వాటిలో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు ఉన్నటువంటి వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ద్వారా మరింత మంది యూజర్లను పెంచుతూ పోతుంది.అయితే టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్లు కూడా పెరిగిపోయారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తికి సంబంధించిన తన వ్యక్తిగత డేటాను మొత్తం ఎంతో సునాయాసంగా హ్యాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో వాట్సప్ ద్వారా మన వ్యక్తిగత డేటా కూడా హ్యాక్ అవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ క్రమంలోనే వాట్సాప్ స్టేటస్ భద్రంగా ఉండాలంటే మన సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల వాట్సప్ డేటా ఎంతో భద్రంగా ఉంటుంది. ఈ విధంగా వాట్స్అప్ డేటా భద్రంగా ఉండడం కోసం వాట్సాప్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే సెక్యూరిటీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన వాట్సాప్ డేటా భద్రంగా ఉండిపోతుంది అయితే ఈ టీచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే..
ముందుగా మనం సెట్టింగ్ లోకి వెళ్లి సెట్టింగ్స్‌పై క్లిక్ చేసి అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. సెట్టింగ్స్‌పై క్లిక్ చేసిన అనంతరం అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఈ విధంగా సెక్యూరిటీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోగానే కొత్త డివైస్ లోకి వాట్సాప్ ఓపెన్ చేయగానే సెక్యూరిటీ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ ఫీచర్ ఆక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సెక్యూరిటీ నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేసి ‘షో సెక్యూరిటీ నోటిఫికేషన్’ను ఎంచుకోవాలి.ఇకపోతే మనం ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసే సమయంలో ముందుగా వాటి గురించి పూర్తిగా తెలుసుకొని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన డేటా కూడా భద్రంగా ఉంటుంది.