మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ తీవ్రత భారత్ లో రోజురోజుకు పెరిగిపోతుంది. మరో పక్క పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీల పై కరోనా పంజా విసిరింది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ 5.0 ఈ నెల 30వ తేదీ వరకు ఉండనుంది. అయితే కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించేలా కేంద్రం ఆరోగ్య సేతు యాప్ రూపొందించి వదిలింది. ప్రతీ ఒక్కరు తమ మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిచిస్తున్నాయి. దాంతో ప్రజలు కూడా అధికంగా ఈ యాప్ ను ఉపయోగించుకుంటున్నారు.
కాగా భారతీయులు అధికంగా వినియోగిస్తున్న ఈ ఆరోగ్యసేతు యాప్ పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. దీంతో కొందరు సైబర్ నేరగాళ్లు ఆరోగ్య సేతు యాప్ పేరుతో కొన్ని నకిలీ లింకులు పంపుతూ మొబైల్ హ్యక్ చేసి డాటా మొత్తం చోరి చేయాలని ప్రయత్నం చేస్తున్నారట. ఆరోగ్య సేతు యాప్ పేరుతో వచ్చే నకిలీ లింకులను ఓపెన్ చేస్తే ‘చాట్ మీ’ యాప్ డౌన్ లోడ్ అవుతుందని, ఆ తర్వాత మొబైల్ హ్యాక్ అయి సమాచారం అంతా చోరికి గురవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇంతకీ ఈ లింకులు పంపిస్తుంది ఎవరో తెలుసా ? పాక్ సైబర్ నేరగాళ్లు అట. ఒక పక్క పాక్ లో కరోనా ఎక్కువై ప్రాణాలు కోల్పోతున్నా పాక్ సైబర్ నేరగాళ్లు మాత్రం ఇండియానే దెబ్బ కొట్టాలని ఈ లింకులను పంపుతున్నారు. వీటిపట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఎవరి మొబైల్ అయినా హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. అయినా ఇక నుండైనా ఏ లింకు పడితే ఆ లింకును ఓపెన్ చేయకుండా.. ఫేక్ లింకులకు దూరంగా ఉందాము. అన్నట్లు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా ఈ నకిలీ లింకులను సైబర్ నేరగాళ్లు ఫార్వడ్ చేస్టున్నారట. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్లారా ఆరోగ్య సేతు యాప్ నకిలీ లింకుతో జాగ్రత్త.