ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో మొబైల్ ఫోన్ల వాడకం రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. అయితే ఫోన్లో పని చేయకపోతే వాటిని రిపేరు చేయించి ఉపయోగించుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలా ఫోన్ పనిచేయకపోయినా లేదా ఫోన్ పాతది అయినా సరే కొత్త మొబైల్ ఫోన్లు కొంటున్నారు. అయితే కొత్తగా తీసుకున్న మొబైల్ ఫోన్లో కి పాత మొబైల్ ఫోన్ లో ఉన్న డేటా పొందటానికి చాలా అవస్థలు పడుతుంటారు. మన పాత మొబైల్ ఫోన్లో ఉన్న డేటాని కొత్త మొబైల్ ఫోన్లోకి ఎలా రికవరీ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
• మన పాత మొబైల్ ఫోన్లో ఉన్న ముఖ్యమైన డేటాని కొత్త మొబైల్ ఫోన్లోకి రికవరీ చేసుకోవడానికి ముందుగా పాత మొబైల్ ఫోన్లో ఉన్న డేటా ని బ్యాక్అప్ చేసుకోవల్సి ఉంటుంది.
• ఇలా మన ఫోన్ లో ఉన్న ముఖ్యమైన డేటా బ్యాకప్ చేయడానికి ముందుగా మన మొబైల్ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి.
• సెట్టింగ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న బ్యాక్ అప్ డేటా & రిస్టోర్ ( backup deta & factory reset ) అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత బ్యాక్ అప్ మై డేటా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
•ఆ తర్వాత కింద మన డేటా బ్యాక్ అప్ కావల్సిన మెయిల్ ఐడి ని ఎంచుకోవాలి.
• ఇలా చేసిన తర్వాత పాత మొబైల్ లోని మన డేటా అంతా కూడా ఇచ్చిన మెయిల్ ఐడి లో ఉంటుంది.
ఇక ఇప్పుడు మీరు కొన్న కొత్త మొబైల్ ఫోన్ లో మీరు బ్యాకప్ డేటా కోసం ఎంటర్ చేసిన మెయిల్ ఐడి లో లాగిన్ అవ్వాలి. ఇలా చేయటం వల్ల మీ పాత మొబైల్ ఫోన్ లో ఉన్న ముఖ్యమైన డేటా మొత్తం కొత్త మొబైల్ ఫోన్ లోకి రికవరీ చేసుకోవచ్చు.