ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్లు కూడా పెరిగి పోయారు. ఇలా అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఎంతోమందిని టార్గెట్ చేస్తూ లక్షల్లో డబ్బులు కొట్టేస్తూ ఉన్నారు. ఇక బాగా చదువుకున్న వాళ్ళు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడం గమనార్హం.ఈ క్రమంలోనే సైబర్ పోలీసులు ఇప్పటికే ఎన్నోసార్లు ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రతిరోజు ఎంతోమంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.
సాధారణంగా మన మొబైల్ ఫోన్ కి గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు వాటికి ఆన్సర్ చేయకపోవడం మంచిది ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్లు ఏవైనా మన వ్యక్తిగత విషయాల గురించి అడిగితే పొరపాటున ఆ విషయాల గురించి చెప్పకపోవడం మంచిది. ఏదైనా మెసేజ్ లేదా ఫోన్ కాల్స్ చేసి మీ OTPని అడిగితే ఎవరితోనూ షేర్ చేయరాదు. ఫోన్ కాల్/sms/ఈ-మెయిల్ ద్వారా వన్-టైమ్-పాస్‌వర్డ్ (OTP) అడిగి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీకి చెందిన ఓ సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సైబర్ మోసం కారణంగా రూ.50 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం, బాధితుడికి కొన్ని రోజుల క్రితం ఏడు నుంచి ఎనిమిదిన్నర సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే వాటి గురించి పట్టించుకోనటువంటి అతను చివరిసారిగా ఒక ఫోన్ రావడంతో లిఫ్ట్. అవతలి వైపు నుంచి ఎవరూ కూడా మాట్లాడలేదు అయితే ఫోన్ కట్ చేసిన కొంత సమయానికి అతనికి వరుసగా మెసేజ్లు వచ్చాయి. అయితే తన ఫోన్ చెక్ చేయగానే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) మెసేజ్ రావడం చూసి షాక్ అయ్యాడు. అంటే.. దాదాపు అర కోటి వరకు డబ్బు పోగొట్టుకున్నట్లు తెలియడంతో హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకే ఇలాంటి మిస్డ్ కాల్స్ వచ్చినా కూడా పొరపాటున లిఫ్ట్ చేయవద్దు సైబర్ పోలీసులు అందరికి అవగాహన చేపడుతున్నారు.