ఓటిపి అవసరం లేకుండా..ఆధార్ నంబర్ తో డబ్బు ట్రాన్స్ఫర్.. ఎలాగో తెలుసా..?

భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఆధార్ కార్డు ని ప్రతి పౌరుడికి గుర్తింపు కార్డుగా భావిస్తారు. ఈ ఆధార్ కార్డు సహాయంతో ప్రభుత్వానికి సంబంధించిన పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా పిల్లల స్కూల్ సర్టిఫికెట్ దగ్గర నుండి డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతిదానికి ఆధార్ నంబర్ తప్పనిసరి అయింది. ఇంతవరకు ఇలాంటి వాటికోసం మాత్రమే ఆధార్ కార్డు నంబర్ ఉపయోగించేవారు. కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉపయోగించవచ్చు. కానీ దాని సహాయంతో మీరు డబ్బును కూడా తీసుకోవచ్చు. ఆధార్ నెంబర్ సహాయంతో డబ్బులు డ్రా చేయడమే కాకుండా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును కూడా బదిలీ చేయవచ్చు.

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సహాయంతో మీ ఆధార్ నంబరు ఉపయోగించి డిజిటల్ లావాదేవీలు చేయవచ్చు. ఆధార్ నంబర్ సహాయంతో ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ఆధార్ నంబర్, ఐరిస్ స్కాన్, వేలిముద్రతో ధృవీకరించడం ద్వారా ఏటీఎంల ద్వారా ఆర్థిక లావాదేవీలను అనుమతిస్తుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం చాలా సురక్షితమైనది. ఎందుకంటే ఈ విధానంలో మీరు బ్యాంక్ వివరాలను అందించాల్సిన అవసరం లేదు.

ఆధార్ నెంబర్ ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు తెరపటానికి ఆధార్ కార్డు నెంబర్ ని బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆధార్ నెంబర్కు ఒకటి లేదా అంతకన్నా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు లింక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ సిస్టం సహాయంతో అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవడమే కాకుండా అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేయటం, డిపాజిట్ చేయడం వంటివి కూడా చేయవచ్చు.

ఈ వ్యవస్థను ఉపయోగించే విధానం :

• ఆధార్ నెంబర్ ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాలని అనుకునే వారు ముందుగా మీ ప్రాంతంలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్ వద్దకు వెళ్లండి.

• ఆ తర్వాత ఓపీఎస్ మెషీన్‌లో 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

• ఆ తర్వాత ఉపసంహరణ, డిపాజిట్, కేవైసీ, బ్యాలెన్స్ విచారణ వంటి వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాలి.

• ఇక ఆ తర్వాత బ్యాంకు పేరు, విత్‌డ్రా చేయాల్సిన మొత్తాన్ని నమోదు చేయండి.

• దీని తర్వాత బయోమెట్రిక్ లావాదేవీని ధృవీకరించి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.