ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే వాట్సప్ లైవ్ లో ఉండగానే లొకేషన్ షేర్ చేయవచ్చు..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ప్రజలు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలకు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లు వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఈ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి సులభంగా ఎన్నో పనులు పూర్తి చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లు మనిషి సమయాన్ని వృధా కాకుండా కాపాడుతున్నాయి. ఇదిలా ఉండగా గతంలో తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే దారి తెలియక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వల్ల దారులు కనుక్కోవడం చాలా సులువుగా మారిపోయింది.

అయితే మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాంట్ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కూడా ఈ తరహా ఫీచర్‌ను అందిస్తోంది. వాట్సాప్‌ వినియోగదారులు లైవ్ లొకేషన్ ని ఇతర వినియోగదారులతో షేర్ చేసే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ లైవ్ లొకేషన్ ఫీచర్ తమ లైవ్ లొకేషన్ ను ఎంతసేపు షేర్ చేయవచ్చనే టైమ్‌ను సెలక్ట్‌ చేసుకొనే సదుపాయం కూడా కల్పిస్తోంది. అంతే కాకుండా వాట్సాప్‌ మెసేజ్‌ల తరహాలోనే..లైవ్ లొకేషన్ ఫీచర్‌ కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. దీంతో లొకేషన్‌ షేర్ చేసిన వ్యక్తులు తప్ప, లైవ్ లొకేషన్‌ను ఎవరూ చూడలేరు. అయితే వాట్సాప్ ద్వారా లైవ్ లొకేషన్ షేర్ చేయడానికి ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

• వాట్సాప్‌లో లొకేషన్‌ను షేర్ చేయడానికి ముందు, స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో WhatsApp లొకేషన్ పర్మిషన్లు ఎనేబుల్ చేయాలి. వాట్సప్ లొకేషన్ పర్మిషన్లు ఎనేబుల్ చేయడానికి ముందుగా స్మార్ట్‌ఫోన్‌లని సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత అక్కడ ఉన్న యాప్స్ అండ్‌ నోటఫికేషన్స్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

• ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి యాప్‌ పర్మిషన్స్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు లొకేషన్‌పై ట్యాప్ చేసి, WhatsAppని ఆన్ చేస్తే వాట్సాప్‌కు లొకేషన్‌కు యాక్సెస్‌ లభిస్తుంది.

• వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేయడానికి ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి లైవ్ లొకేషన్‌ని షేర్ చేయాలనుకుంటున్న పర్స్నల్ లేదా గ్రూప్ చాట్‌కి వెళ్లి అక్కడ చాట్ విండోస్‌లో.. అటాచ్> లొకేషన్> షేర్ లైవ్ లొకేషన్‌పై క్లిక్‌ చేయాలి.

• ఇప్పుడు లొకేషన్‌ షేర్‌ చేయాలనుకుంటున్న సమయాన్ని ఎంచుకోని తర్వాత సెండ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ సమయం పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా లైవ్‌ లొకేషన్‌ షేరింగ్‌ ఎండ్‌ అయిపోతుంది. అవసర సమయంలో మధ్యలో కూడా లొకేషన్ షేరింగ్ ని ఆపివేయవచ్చు.