వాట్సప్ ఈ కొత్త ఫీచర్స్ గమనించారా… వీటిని ఎలా వాడాలో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగిస్తున్నటువంటి ఇన్స్టంట్ మెసేజ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే వాట్సాప్ యూజర్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే యూజర్లకు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ కొత్త ఫీచర్స్ ఎలా ఉపయోగించాలి వాటి ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ప్రైవేట్ ఆడియన్స్ సెలెక్టర్: మీరు షేర్ చేసే స్టేటస్ ప్రతీది మీ కాంటాక్ట్‌లో ఉన్న యూజర్లు అందరికీ కాకపోవచ్చు. అందుకే ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసింది వాట్సప్ . మీరు అప్‌డేట్ చేసే స్టేటస్ ఎవరు చూడాలి ఎవరు చూడకూడదు అనీ నిర్ణయించే అవకాశం మీకే ఉంటుంది.

వాయిస్ స్టేటస్: ఇప్పటివరకు మనం ఫోటోలు వీడియోలను స్టేటస్ గా పెట్టుకుంటున్నాం ఇకపై వాట్సప్ స్టేటస్‌లో 30 సెకండ్ల ఆడియో కూడా అప్‌డేట్ చేయొచ్చు. ఏదైనా టైప్ చేయడం కన్నా వాయిస్ రికార్డ్ ద్వారా చెప్పాలనుకునేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

స్టేటస్ రియాక్షన్: వాట్సప్ స్టేటస్‌కి వేగంగా రిప్లై ఇచ్చేందుకు స్టేటస్ రియాక్షన్స్ ఫీచర్ అందిస్తోంది. స్టేటస్‌కి టెక్స్‌ట్, వాయిస్ మెసేజ్, స్టిక్కర్స్ ద్వారా రిప్లై ఇవ్వొచ్చు.

స్టేటస్ ప్రొఫైల్: స్టేటస్ ప్రొఫైల్ రింగ్‌లో కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ రింగ్‌లు మీ కాంటాక్ట్‌లో ఉన్న వారి ప్రొఫైల్ పిక్చర్స్ కనిపిస్తాయి. ఛాట్ లిస్ట్స్, గ్రూప్ పార్టిసిపెంట్స్ లిస్ట్స్, కాంటాక్ట్ ఇన్ఫోలో కూడా ఇవి కనిపిస్తాయి