మీ మొబైల్ పోగొట్టుకున్నారా.. అయితే వెంటనే ఇలా చేయకపోతే సమస్యలు తప్పవు…?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటంతో ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడకానికి బాగా అలవాటు పడ్డారు. మొబైల్ ఫోన్ లేకపోతే ఒక్క రోజు కూడా ఉండలేక పోతున్నారు. ఎందుకంటే ప్రతి పనికి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. షాపింగ్ కి వెళ్ళిన హోటల్ కి వెళ్ళిన ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ఒక్క రోజులోనే కొత్త మొబైల్ ఫోన్స్ కొంటున్నారు. అయితే ఫోన్ పోగొట్టుకున్నందుకు ఏమాత్రం టెన్షన్ లేకుండా కొత్త ఫోన్ కొని వినియోగిస్తున్నారు. ఇలా ఫోన్ పోగొట్టుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొని ప్రమాదం ఉంటుంది. అందువల్ల మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే తప్పక చేయవలసిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాం

1.పోలీస్ కంప్లైంట్ :

మొబైల్ పోయిన వెంటనే పోలీస్ కంప్లేయింట్ ఇవ్వడం వల్ల మొబైల్ తిరిగి దొరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మొబైల్ కు సంబంధించిన ఐఎంఈఐ ( IMEI ) నెంబర్స్ కంప్లేయింట్ లో జత చేయడం వల్ల సెంట్రల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోలీసులు పోయిన ఫోన్ ను ట్రాక్ చేసి పట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల మొబైల్ పోయిన వెంటనే ఐఎంఈఐ ( IMEI ) నెంబర్ల ద్వారా పోలీసులకు కంప్లేయింట్ ఇవ్వాలి.

2.సిమ్ కార్డ్ బ్లాక్ :

మొబైల్ పోయిన తర్వాత టెన్షన్ పడకుండా ముందుగా మీ సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలి. మన మొబైల్ నెంబర్ కు వచ్చే పోన్ కాల్స్, ఓటిపి వంటి సమాచారం ఇతరులకు తెలియకుండా ముందుగా కస్టమర్ కేర్ ద్వారా మొబైల్ సిమ్ కార్డ్ బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత మళ్ళీ అదే నెంబర్ పై కొత్త సిమ్ కార్డ్ తీసుకోవచ్చు.

3.మొబైల్ లాక్ :

మొబైల్ పోయిన తరువాత పోన్ లోని డేటా ఇతరుల చూడకుండా ఉండటానికి మొబైల్ లో ఉన్న డేటా
ఎరేజ్ చేసుకుని అవకాశం ఉంటుందని చాలా మందికి తెలియదు. గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ( CEIR ) అనే వెబ్సైట్ ద్వారా మొబైల్ పోగొట్టుకున్న తర్వాత మీ ఫోన్ లాక్ చేసే వీలు ఉంటుంది.

4.మొబైల్ డేటా డిలీట్ :

ఒకవేళ మన మొబైల్ పొగుట్టుకుపోయిన తర్వాత ఫైండ్ మై డివైజ్ ( find my device ) అనే వెబ్ సైట్ లోకి వెళ్ళి మీ ఈ- మెయిల్ తో లాగిన్ అయిన తరువాత మొబైల్ ఆన్ లో ఉంటే మొబైల్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే.. మొబైల్ లోని డేటా ను ఇతరులు చూడకుండా డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.