ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే కొందరికి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి.ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు ప్రతి ఒక్క విషయంలోను ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.మీకు ఒకటి కంటే ఎక్కువగా బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఈ విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
మనకు ఎన్ని అకౌంట్లో ఉన్నప్పటికీ ఆకౌంట్లో మినిమం బాలన్స్ మెయింటైన్ చేస్తూ ఆ అకౌంట్ యాక్టివ్ గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం.అందుకే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా కూడా అందులో మినిమం బాలన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే ఒకటి కన్నా ఎక్కువగా అకౌంట్స్ ఉన్నప్పుడు తొందరగా మన బ్యాంక్ డీటెయిల్స్ సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మనం భారీగా మోసపోవాల్సి ఉంటుంది.
ఇక ఒక బ్యాంకు కన్నా ఎక్కువగా బ్యాంకులలో మనకు అకౌంట్లు కనుక ఉంటే వార్షిక చార్జీలు భారీ మొత్తంలో కట్ అవుతాయనే విషయాన్ని కూడా గుర్తు ఉంచుకోవాలి.ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో అదే సమయంలో మన సిబిల్ స్కోర్ పై కూడా ఆ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే అవసరమైతే తప్ప మిగతా సమయాలలో ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే వెంటనే వాటిని క్లోజ్ చేయడం ఎంతో మంచిది.