ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చి ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరొక శుభవార్త తెలియజేసింది. భారతదేశ ప్రజలకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఆధార్ కార్డు లో ఏ చిన్న పొరపాటు ఉన్న కూడా వెంటనే వాటిని అప్డేట్ చేయించాలి. అయితే ఇలా ఆధార్ కార్డులో చిన్న చిన్న మార్పులు చేయడం, వాటిని అప్డేట్ చేయించడం కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ కార్డు అప్డేట్ చేయించడానికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సచివాలయాల్లోనే ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఆధార్ కార్డు అప్డేట్ బాధ్యతలను సచివాలయాలకు అప్పగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలలోని సచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొదటి క్యాంపులో జనవరి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులపాటు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆ తరువాత మళ్లీ ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు రెండో విడత క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ పట్టణ ప్రజలు ఆధార్ కార్డు అప్డేట్ చేయటానికి ఆధార్ సెంటర్ కు వెళ్లి ఇబ్బందులు పడకుండా దగ్గరలోని సచివాలయానికి వెళ్లి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పటికే ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు. ప్రజలు ఆఫీసులో చుట్టూ తిరిగే అవసరం లేకుండా వార్డు సచివాలయానికి వెళ్లి వారి పనులను సులభంగా నెరవేర్చుకునే అవకాశం కల్పించారు. దీంతో ప్రజలకు అవసరమైన ఏ ప్రభుత్వ పరమైన పనులను సులభంగా సచివాలయాలలో పొందవచ్చు.