ఫోన్ పే వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై విదేశాల్లో ఫోన్ పే ద్వారా యూపీఐ చెల్లింపులు..!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దీనితో ఆర్థిక లావాదేవీలోని యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపుల దిశగా ప్రజలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఫోన్ పే ద్వారా అత్యధికంగా కస్టమర్లు యూపీఐ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వినియోగదారుల అవసరాల నిమిత్తం ఫోన్పే కూడా కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా విదేశాలలో ఉండే భారతీయులకు ఫోన్ పే శుభవార్త తెలియజేసింది. గతంలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాలంటే కేవలం మన దేశంలో మాత్రమే చేసా అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం విదేశాలలో కూడా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే విధానాన్ని ఫోన్పే అమలులోకి తీసుకువచ్చింది.

సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు మీరు అక్కడ ఉపయోగించే కరెన్సీని తీసుకుని వాడుకోవాలి..లేదా మీ నగదుని ఒక కార్డులోకి మార్చుకుని ఆ కార్డని వాడుకోవాల్సి ఉంటుంది. మన బ్యాంకు ఖాతాలు లింక్ చేసిన యూపీఐ అకౌంట్ నుంచి చెల్లింపులు చేయడం విదేశాలలో సాధ్యం కాదు. అయితే ఇప్పుడు విదేశాల్లో కూడా యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం ఫోన్ పే తీసుకొచ్చింది. విదేశాలలో యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపే విధానాన్ని మొట్టమొదటిసారిగా దేశంలో అందుబాటులోకి తెచ్చిన ఘనత ఫోన్ పే కి దక్కుతుంది. ఈ విధానం విదేశాలలో ఉన్న భారతీయులకు ఎంతో ఉపయోగపడుతుంది.

విదేశాల్లో ఉన్నప్పుడు భారతీయ బ్యాంకు ఖాతాను లింక్ చేసిన ఫోన్ పే ఖాతా నుంచి మీరు డిజిటల్ చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సదుపాయాన్ని కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం చేసినట్లు ఫోన్ పే వెల్లడించింది. యూపీఐ ద్వారా విదేశాలలో కూడా చెల్లింపులు చేసే విధానాన్ని ముందుగా యూఏఈ, మారిషస్, సింగపూర్, నేపాల్, భూటాన్ లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా విదేశాల్లో పర్యటించే భారతీయ పర్యాటకులకు చాలా ఈ సౌలభ్యంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు సమయానికి విదేశీ కరెన్సీ మీ దగ్గర లేకపోతే.. ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. అక్కడి కరెన్సీ కోసం ఫారెన్ ఎక్స్ ఛేంజ్ సెంటర్ల కోసం వెతుక్కోవడం, వారికి కమీషన్లు కట్టే బాధ తప్పుతుంది. అయితే తొందర్లోనే ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు.