లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఎల్ఐసి ) సంస్థ దేశవ్యాప్తంగా ప్రజలకు జీవిత భీమా సదుపాయం కల్పించి ఎన్నో సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఎల్ఐసి పాలసీదారుల అవసరాల నిమిత్తం ఎన్నో ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఎల్ఐసి సంస్థ పాలసీదారులకు మరొక శుభవార్త తెలియజేసింది. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా పాలసీదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మొబైల్ ఫోన్ ద్వారా ఎల్‌ఐసీ సర్వీసులను అందించే విధంగా అడుగులు వేస్తోంది. ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారుల కోసం ఇటీవల మొట్టమొదటి సారిగా వాట్సాప్ సేవలను ప్రారంభించింది.
ఈ క్రమంలో పాలసీదారులు ఎల్‌ఐసీ అధికారిక వాట్సాప్ చాట్‌బాక్స్ ద్వారా పాలసీ ప్రీమియం వివరాలు, ULIP ప్లాన్, స్టేట్‌మెంట్లతో పాటు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో తమ పాలసీలను నమోదు చేసుకోని వారు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో సేవలను పొందేందుకు ముందుగా నమోదు చేసుకోవాలి. పాలసీదారులు తమ పాలసీని నమోదు చేసుకోవడానికి www.licindia.in లో లాగిన్ అవ్వాలి. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎల్‌ఐసి పాలసీ నమోదు చేసిన తర్వాత, వారు ఎల్‌ఐసి వాట్సాప్ సేవలను ఉపయోగించడానికి కొన్ని దశలను ఉపయోగించడం ద్వారా వాట్సాప్ సేవలను పొందవచ్చు.
ఎల్‌ఐసీ వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న సేవలు :
ఎల్ఐసి సంస్థ వాట్సాప్ ద్వారా పాలసీదారులకు ప్రీమియం లోనే, బోనస్ ఇన్ఫర్మేషన్, లోన్ అర్హత , రుణ చెల్లింపు కొటేషన్, రుణ వడ్డీ చెల్లింపు , ప్రీమియం చెల్లించిన సర్టిఫికేట్, ULIP-యూనిట్ల ప్రకటన, ఎల్‌ఐసీ సేవల లింక్స్, వాట్సాప్ సేవలు ప్రారంభించడం/ నిలిపివేయడం వంటి సమాచారాన్ని అందిస్తోంది.
ఎల్‌ఐసీ వాట్సాప్ సేవలు ఎలా పొందాలి :
• వాట్సాప్ ద్వారా ఎల్ఐసి సేవలు పొందటానికి ముందుగా మీ ఫోన్‌లో ఎల్‌ఐసీ వాట్సాప్ నంబర్ 8976862090ను సేవ్ చేసుకోవాలి.
• ఆ తర్వాత వాట్సాప్ లో ఎల్‌ఐసి వాట్సాప్ చాట్ బాక్స్‌లో సెర్చ్ చేసి ఓపెన్ చేసి చాట్ బాక్స్‌లో ‘హాయ్’ అని మెసేజ్ పంపాలి.
• ఎల్‌ఐసీ వెంటనే వాట్సాప్‌లో 11 ఆప్షన్స్ పంపుతుంది.
సేవల ఎంపిక కోసం చాట్‌లో మీకు కావాల్సిన నెంబర్‌ను ఎంపిక చేసుకుని రిప్లై ఇవ్వండి.
ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో పాలసీని ఎలా నమోదు విధానం :
• ఆన్లైన్లో పోర్టల్ పాలసీ నమోదు చేయడానికి ముందుగా www.licindia.in లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ‘కస్టమర్ పోర్టల్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
• పోర్టల్ పాలసీకి మీరు కొత్త వినియోగదారు అయితే, ‘న్యూ కస్టమర్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయండి.
• ఇప్పుడు మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ని ఎంచుకుని, ఆపై మీ వివరాలను సబ్మిట్ చేయాలి.
• ఇప్పుడు మీ యూజర్ ఐడిని ఉపయోగించి ఆన్‌లైన్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
• ఆ తర్వాత ప్రాథమిక సేవలు కింద విధానాలను జోడించడంపై క్లిక్ చేయండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయడానికి మీ అన్ని పాలసీల వివరాలను అందించాలి.