ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ … ఐఫోన్ యూజర్లు కోసం వాట్సప్ సరికొత్త ఫీచర్స్..?

ప్రస్థుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. వాట్సప్ వినియోగం పెరగటంతో తమ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం కొత్త కొత్త అప్ డేట్లు తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా ఐవోఎస్ వినియోగదారుల కోసం వాట్సప్ ఒక లేటెస్ట్ అప్ డేట్ తీసుకొచ్చింది. దాని ద్వారా ఐఫోన్ యూజర్లు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్‌ ని పొందనున్నారు. ఆ అప్ డేట్ ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌ ఒక కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఐఫోన్ యూజర్లు లేటెస్ట్ వర్షన్ కి అప్ డేట్ అయితే ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. తాజాగా ఐఓఎస్ యూజర్ల కోసం 23.3.77 వర్షన్ అప్ డేట్ తీసుకొచ్చింది. ఈ వర్షన్ ద్వారా సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని ఐఫోన్ యూజర్లు పొందుతారని వాట్సప్ వెల్లడించింది .ఈ లేటెస్ట్ వర్షన్ ద్వారా ముఖ్యంగా పిక్చ్ ఇన్ పిక్చర్‌(PIP) ఫీచర్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. సాధారణంగా వాట్సాప్ ద్వారా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు వేరే యాప్ ఓపెన్ చేస్తే వీడియో కాల్ పాజ్ అవుతుంది. కానీ, ఇప్పుడు ఈ పీఐపీ ఫీచర్ ద్వారా అలా జరగదు.

ఈ ఫీచర్ ని డిసెంబర్ టెస్ట్ చేసి ఐఓఎస్ యూజర్ల కోసం ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్ ని పాజ్ చేయడం, హైడ్ చేయడం కూడా చేయవచ్చు. అంతేకాకుండా.. ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న మరికొన్ని ఫీచర్లను ఐఓఎస్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ లో ఫొటోలు, వీడియోలు పంపే సమయంలో క్యాప్షన్ జోడించే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి నుంచి డాక్యుమెంట్స్ సెండ్ చేసే సమయంలో కూడా క్యాప్షన్ పెట్టవచ్చు. అలాగే వాట్సప్ గ్రూపులకు సంబంధించి డిస్క్రిప్షన్‌ ని పరిమితి లేకుండా సుదీర్ఘంగా రాసేందుకు వీలు కల్పిస్తున్నారు. ఐఫోన్ యూజర్ల కోసం కూడా అవతార్ ఫీచర్ ని తీసుకొచ్చారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తరహాలో ఐఓఎస్ యూజర్లు కూడా వాట్సాప్ కి పర్సనలైజ్డ్‌ అవతార్ ని రూపొందించుకోవచ్చు.