ఇకపై వాయిస్ నోట్ కూడా స్టేటస్ గా పెట్టుకోవచ్చు.. కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్!

ఎంతోమంది వినియోగదారుల ఉపయోగించే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే వాట్సప్ తాజాగా మరొక సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే “వాయిస్ స్టేటస్ అప్‌డేట్స్”. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు వాయిస్ నోట్స్‌ను స్టేటస్ అప్‌డేట్స్‌గా పెట్టుకోవచ్చు. ఎవరికైతే టైప్ చేయడం ఇష్టం ఉండదో అలాంటివారు ఇకపై వాయిస్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు.

ఇప్పటివరకు వాట్సప్ స్టేటస్ లోకి కేవలం ఫోటోలు వీడియోలు మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంది. ఇకపై వాయిస్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చని వాట్సాప్ వెల్లడించింది. వాబీటాఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. యూజర్లు స్టేటస్‌లో టెక్ట్స్‌తో పాటు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేసుకోవచ్చు. వాట్సప్ ఓపెన్ చేసి తర్వాత కీబోర్డ్ లో మైక్రో సింబల్ పై టచ్ చేసి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దానిని వాయిస్ రూపంలో టైప్ చేయవచ్చు. ఈ వాయిస్ మెసేజ్ ని స్టేటస్ లో పెట్టుకోవచ్చు.

ఉదాహరణకు మీరు ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటే ఇదివరకు హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి వారి ఫోటోతో సహా మనం వాట్సాప్ స్టేటస్ పెట్టుకునే వారం అయితే ఇకపై అలా కాకుండా స్వయంగా మనమే స్వయంగా వాయిస్ టైప్ చేసి ఈ మెసేజ్ ను స్టేటస్ లో పెట్టుకోవచ్చు. అయితే ఈ వాయిస్ స్టేటస్ కూడా 24 గంటల తర్వాత డిస్ అప్పియర్ అవుతుంది. ఎవరైతే టైప్ చేయడానికి ఇష్టపడరో అలాంటివారు ఇలా వాయిస్ స్టేటస్ పెట్టుకోవచ్చు.