సాధారణంగా మనం రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది ఆహార పదార్థాల కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఇకపై రైలు ప్రయాణం చేసేటప్పుడు ఆహార పదార్థాల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చితే అయితే ఇదివరకు రైలులోనే మనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ ఇవ్వడం ద్వారా తీసుకువచ్చారో అలా కాకుండా ఇకపై బయట ఫుడ్ కూడా చాలా సులభంగా వాట్సప్ ద్వారా ఆర్డర్ చేసుకొని మనం ప్రయాణించే చోటుకే ఫుడ్ డెలివరీని తీసుకోవచ్చు.
ఇలా వాట్సాప్ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సదుపాయాన్ని రైల్వే శాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై మనం రైల్ టికెట్ బుక్ చేసిన వెంటనే మనకు కావలసిన ఆహార పదార్థాలను కూడా ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని అందించునుంది. ఐఆర్సీటీసీ ప్రస్తుతం www.ecatering.irctc.co.in, ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తుండగా.. 8750001323 వాట్సాప్ నెంబర్ ద్వారా ఫుడ్ ఆర్డర్ సేవలను అందుబాటులోకి రానున్నాయి.
రైల్వే టికెట్ బుక్ చేసుకోగానే వాట్సాప్ నెంబర్ నుండి ఈ-కేటరింగ్ సర్వీస్ సేవలకు సంబంధించిన www.ecatering.irctc.co.in వెబ్ లింక్ వస్తుంది. అక్కడ కస్టమర్లు అందుబాటులో ఉన్న స్టేషన్లలో తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. రైల్వే శాఖ ఈ కొత్త సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తుండగా.. త్వరలోనే ఈ సదుపాయాన్ని విస్తరించే అవకాశం ఉంది.