ప్రజలు ఉపయోగించే నిత్యవసర వస్తువులలో పప్పు ఉప్పు కూరగాయలు తో పాటు గ్యాస్ కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో గ్యాస్ వినియోగదారుల సంఖ్య ఎక్కువగా పెరగటం వల్ల గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో చిన్న మధ్య తరగతి కుటుంబాలు గ్యాస్ సిలిండర్లు కొనటానికి చాలా అవస్థలు పడుతున్నారు. అయితే గ్యాస్ వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ శుభవార్త తెలియజేసింది. ఫ్లిప్కార్ట్ లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై డబ్బు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా పేటీఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి ఆన్లైన్ యాప్స్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి డబ్బు ఆదా చేయవచ్చు.
అయితే ఫ్లిప్కార్ట్ లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి సూపర్ కాయిన్స్ ఆఫర్ కలిగి ఉన్న వారు మాత్రమే అర్హులు. మొబిక్విక్ భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు ఈ సర్వీసులు అందిస్తోంది. మీ వద్ద ఫ్లిప్ కార్ట్ లో సూపర్ కాయిన్స్ ఉంటే.. తక్కువ ధరకే సిలిండర్ పొందొచ్చు. మీ వద్ద ఉన్న సూపర్ కాయిన్స ఆధారంగా మీకు వచ్చే తగ్గింపు కూడా ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ కాయిన్స్ ఉన్నవారు ఎక్కువ డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఫ్లిప్కార్ట్ లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీ మొబైల్ లోని ఫ్లిప్కార్ట్ లోకి వెళ్లి అక్కడ సూపర్ కాయిన్స్ పై క్లిక్ చేస్తే మీకు కుడి వైపున సూపర్ కాయిన్ పే అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అయ్యి అక్కడ మొబైల్ రీచార్జ్, వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, డీటీహెచ్ రీచార్జ్, ఫాస్టాగ్, ఎల్‌పీజీ బుకింగ్, బ్రాడ్ బాండ్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో మీరు ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ గ్యాస్ సిలిండర్ కంపెనీని ఎంచుకొని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మేక్ పేమెంట్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు బిల్లు మొత్తం కనిపిస్తుంది. మీ వద్ద సూపర్ కాయిన్స్ ఉంటే.. వాటికి ఎంత తగ్గింపు ఉందో చూపిస్తుంది. ఇలా ఫ్లిప్కార్ట్ లో సూపర్ కాయిన్స్ ఉన్నవారు అది తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని డబ్బు ఆదా చేయవచ్చు. మీరు తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.