టెక్నాలజీ పెరగడంతో మోసం చేసే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. ఇలా పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా పెద్ద ఎత్తున సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోని చాలామంది తమ వ్యక్తిగత విషయాలన్నీ కూడా సైబర్ నేరగాళ్లు చేతిలో పడటం వల్ల ఎంతో డబ్బును నష్టపోవాల్సి వస్తోంది. ఇకపోతే మనం పెద్ద మొత్తంలో డబ్బు నదులు సంపాదించి వాటిని భద్రంగా ఉంచడం కోసం బ్యాంకులో సేవ్ చేసి మనం వాటిని భద్రపరచడమే కాకుండా పాస్వర్డ్ విషయంలో మాత్రం చాలా పకడ్బందీగా ఆలోచించలేమని ఓ సర్వే వెల్లడించింది.
ఈ డిజిటల్ ప్రపంచంలో కేవలం పాస్ వర్డ్ సరిగా లేకపోవడం వల్ల చాలామంది మోసపోతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో భాగంగా పలు అధ్యయనాలు చేయగా భారతదేశంలో సుమారు 3.4 మిలియన్ల మంది ఓకే పాస్ వర్డ్ ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఇలా వీరందరూ కూడా కేవలం PASS WORD అనే పాస్ వర్డ్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇలా అందరూ ఒకే విధమైన పాస్ వర్డ్ పెట్టుకోవడం వల్ల ఇతరుల డేటాను దొంగలించడం చాలా సులభంగా మారింది.
దీనితోపాటు చాలామంది ఉపయోగించే మరొక పాస్ వర్డ్ 123456 అని పేర్కొంది. అత్యంత విస్తృతంగా ఉపయోగించే రెండవ పాస్‌వర్డ్ 1245678, కాగా.. మూడవ పాస్‌వర్డ్ 123456789 అని పేర్కొంది. ఈ పాస్ వర్డ్స్ అన్ని కూడా బలహీనమైన పాస్ వర్డ్ అని ఇలాంటి పాస్వర్డ్ పెట్టుకున్న వాళ్ళందరూ చాలా సులభంగా హాకింగ్కు గురి కావడమే కాకుండా డబ్బులు నష్టపోవాల్సి వస్తుందని NordPass తన నివేదిక ద్వారా తెలియజేశారు. ఇలాంటి పాస్వర్డ్ ఎవరైనా పెట్టి ఉంటే వెంటనే వాటిని మార్చుకోవాలని సూచించారు.