ఆధార్ కార్డు లో అడ్రెస్స్ మార్చుకోవాలా.. అయితే ఆన్లైన్ లో ఇలా చేస్తే చాలు..?

భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డు. ప్రభుత్వానికి సంబంధించిన అనేక పనులు చేసుకోవటానికి ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల దేశంలోని నివశిస్తున్న ప్రతి ఒక్కరికి ఆధార్ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఆధార్ కార్డ్ ఒకసారి చేయించిన తర్వాత మన చిరునామా, ఫోన్ నెంబర్ మారితే వెంటనే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇలా చిరునామా ఫోన్ నెంబర్ అప్డేట్ చేయడానికి ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఆ కష్టం లేకుండా ఆధార్ కార్డ్ లో అడ్రెస్స్ మార్చటానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.

గతంలో ఆధార్ కార్డ్‌లోని అడ్రస్ అప్‌డేట్ చేయడానికి, కార్డ్ హోల్డర్ వ్యక్తిగత చిరునామా రుజువును అందించాలి. అయితే ఇప్పుడు చిరునామాను మార్చడానికి రుజువును అందించాల్సిన అవసరం లేదు. కార్డ్ హోల్డర్ కుటుంబ పెద్ద చిరునామాను రుజువుగా చూపిస్తే సరిపోతుంది. రేషన్‌ కార్డు, మార్కుల షీట్, మ్యారేజ్‌ సర్టిఫికెట్, పాస్‌పోర్టు తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించి అడ్రస్ అప్డేట్ చేయవచ్చు. కానీ, ఇందులో ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి.

ఆన్లైన్ ద్వారా ఆధార్ లో అడ్రస్ అప్డేట్ చేయడానికి రేషన్ కార్డ్, మార్క్ షీట్, పాస్‌పోర్ట్ వంటి వాటిని సంబంధాల పత్రాలుగా ఉపయోగించవచ్చు. ఇందులో దరఖాస్తుదారుడి పేరు, కుటుంబ పెద్ద, ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. కుటుంబ పెద్ద కి వచ్చే OTP ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఈ అభ్యర్థనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి కుటుంబ పెద్దకు 30 రోజుల సమయం ఇవ్వబడుతుంది. ఇలా ఇంటికి దూరంగా ఇతర ప్రదేశాలలో ఉండే వారికి ఇలా కుటుంబ పెద్ద కి సంబందించిన పాత్రల సహాయంతో ఆన్లైన్ ద్వారా చిరునామా అప్డేట్ చేయవచ్చు.