ఎవరికైనా ఎస్ఎంఎస్ చేయాలనుకుని మర్చిపోయారా.. ఇకపై ఆ సమస్య ఉండదు.. ఎస్ఎంఎస్ కూడా షెడ్యూల్ చేయొచ్చు తెలుసా?

సాధారణంగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలను ఇతరులకు పంపించడం సరైన సమయానికి మర్చిపోతూ ఉంటాము. ఇలా మర్చిపోయిన సమయంలో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు.ఏదైనా ఆఫీసుకు సంబంధించిన విషయాలు కానీ లేదా మన వ్యక్తిగత విషయాల గురించి కానీ సరైన సమయంలో ఇతరులకు సమాచారం అందించకపోవడంతో ఎన్నో నష్టాలు కూడా ఏర్పడుతుంటాయి. అయితే మనకు ఆ విషయం గుర్తొచ్చినప్పుడు ఆ సమాచారం ఇతరులకు ఏ సమయానికి వెళ్లాలో అలా పంపించే విధంగా ముందుగానే మనం షెడ్యూల్ చేసుకుని అవకాశాన్ని గూగుల్ మెసేజెస్ యాప్ మనకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇలా మనం పంపించాల్సిన ఎస్ఎంఎస్ ముందుగా పంపించి షెడ్యూల్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని వస్తే.. ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ మెసేజ్ యాప్ ఓపెన్ చేసిమీరు ఎవరికైతే మెసేజ్ పంపించాలనుకుంటున్నారో వారి పేరు సెలెక్ట్ చేసి మీరు పంపించాల్సిన మెసేజ్ టైప్ చేసి పెట్టాలి. ఆ తర్వాత సెకండ్ బటన్ పై క్లిక్ చేయకుండా లాంగ్ ప్రెస్ చేయాలి. ఇలా చేయడంతో మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో షెడ్యూల్ సెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

ఈ ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మనం ఆ మెసేజ్ ఏ సమయానికి ఎన్నో తేదీ పంపించాలో సెలెక్ట్ చేసుకోవాలి.ఇలా సమయం తేదీ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కితే చాలు ఇక ఆ మెసేజ్ షెడ్యూల్ అయినట్లే మనం ఏ సమయానికైతే షెడ్యూల్ పెట్టి ఉంటాము అదే సమయానికి అవతల వారికి మెసేజ్ చేరుతుంది.ఈ అద్భుతమైన ఫీచర్ ద్వారా ఎవరికైనా మనం పెళ్లి రోజు లేదా పుట్టినరోజు శుభాకాంక్షలు పంపించాలనీ మర్చిపోతూ ఉంటారో అలాంటివారికి ఈ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి.