నటి రెజినాను వేధించిన ఆ వ్యక్తి.. నేరుగా ఆ కోరిక కావాలి అంటూ!

రెజీనా దక్షిణ భారత చలనచిత్ర నటి. తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ఈమె పూర్తి పేరు రెజీనా కాసాండ్రా. ఈ తమిళ బ్యూటీ 2005లో కంద నాల్ ముదల్ అని తమిళ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2012లో శివ మనసులో శృతి అని తెలుగు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈ సినిమా ద్వారా ఉత్తమ నటిగా SIIMA అవార్డును సొంతం చేసుకుంది. ఇక కన్నడ, హిందీలలో కూడా నటించడం జరిగింది. ఆ తరువాత వరుస అవకాశాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, శౌర్య వంటి సినిమాలు తన కెరీర్లో చెప్పుకోదగినవి.

అయితే ప్రస్తుతం ఆమె గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. గతంలో ఆమెకు తమిళంలో ఒక సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తామంటూ పరోక్షంగా పడక సుఖం కావాలి అని కోరడంతో వెంటనే ఫోన్ పెట్టేసినట్లు తానే స్వయంగా పేర్కొనడం జరిగింది.

సినీ ఇండస్ట్రీలో రోజురోజుకు ఇలాంటి వేధింపులు పెరుగుతున్నాయని, నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా ఇలాంటి వేధింపులకు గురైందని, నటి భావన కూడా ఆమెకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తుండడంతో ఆమెను స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా ఎన్నో రోజులుగా మనసులో దాచుకున్న విషయాన్ని బయటకు చెప్తున్నానని తెలిపింది.

ఇక బాలీవుడ్ లో అయితే కంగనా రౌనత్ కు సినిమా అవకాశాలు ఇస్తామంటూ పడక సుఖం అనుభవించినట్లు అనేక కథనాలు వినిపించాయి. ప్రస్తుతం ఇలాంటి వేధింపులు సినీ ఇండస్ట్రీలో రోజురోజుకు పెరుగుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం రెజీనా శూర్ప నగై, నేనె నా, సరిహద్దు, కల్ల పార్ట్ అనే తమిళ చిత్ర షూటింగ్ లలో బిజీగా ఉన్నట్లు సమాచారం.