ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల బ్యాంకుకు వెళ్లే పని లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే నగదు చెల్లింపులు చేయవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, UPI , BHIM వంటి ద్వారా నేరుగా మొబైల్ నెంబర్ కి నగదు బదిలీ చేయొచ్చు. ఇలా చేయటం వల్ల బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండా కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీ చేయవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో ఈ ప్రక్రియ నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఒక అకౌంట్ కి బదులు మరొక అకౌంటు కి పొరపాటున డబ్బు బదిలీ చేయడం వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలా పొరపాటున నెట్ బ్యాంకింగ్ ద్వారా మరొకరి ఖాతాకు డబ్బు బదిలీ చేసినప్పుడు తిరిగి ఆ డబ్బును ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• నెట్ బ్యాంకింగ్ ద్వారా పొరపాటున మరొకరి కథకు డబ్బు బదిలీ చేసినప్పుడు అలా బదిలీ చేసిన డబ్బును తిరిగి మన ఖాతాకు బదిలీ చేయమని బ్యాంక్ ని అభ్యర్థించవచ్చు.
• అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు బదిలీ చేసినప్పుడు మొబైల్ మనీ ఐడెంటిఫికేషన్ నంబర్ (MMID) , మొబైల్ నంబర్‌తో పాటు డబ్బు స్వీకరించిన వ్యక్తి వివరాలు తప్పుగా ఉండటంవల్ల మన అభ్యర్థన తిరస్కరించబడుతుంది.
• అలాంటి సమయంలో మీ బ్యాంక్‌కు సమాచారం అందించి కస్టమర్ కేర్ ను సంప్రదించాలి. మనం డబ్బు బదిలీ చేసిన సమయం తేదీ మన బ్యాంక్ అకౌంట్ నంబర్ తో పాటు మనం డబ్బు పంపిన ఇతర అకౌంట్ నంబర్ వివరాలను మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్ ని సందర్శించి అక్కడ అందజేయాలి .
• ఆ తర్వాత డబ్బు బదిలీ అభ్యర్థన ఫిర్యాదు చేయటం వల్ల సదరు వ్యక్తి వివరాలను బ్యాంక్ మీకు అందజేస్తుంది. దీంతో ఆ వ్యక్తి ఖాతా ఉన్న బ్యాంక్ ని సందర్శించి అక్కడ సిబ్బందికి దీని గురించి తెలియజేయాలి. ఆ తర్వాత ఆ బ్యాంకు సిబ్బంది సంబంధిత వ్యక్తిని సంప్రదించి మీ డబ్బును తిరిగి చెల్లించమని అభ్యర్థిస్తుంది. ఇలా చేయటం వల్ల పొరపాటున బదిలీ చేసిన డబ్బు తిరిగి పొందవచ్చు.
