నవంబర్ నెలలో పది రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు… ఆందోళనలో కస్టమర్లు?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రజలు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ సేవలు వినియోగించుకుంటున్నప్పటికీ.. చాలామంది ప్రజలు అనేక కారణాలవల్ల బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సెలవు దినాలలో బ్యాంకులు మూతపడటం వల్ల ఎన్నో పనులు ఆగిపోతున్నాయి. ముఖ్యంగా రైతులు, వ్యాపారవేత్తల నగదు బదిలీలు, డబ్బు విత్ డ్రా వంటి పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. అంతేకాకుండా ఈ నవంబర్ నెలలో పది రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అందువల్ల ఆ తేదీల వివరాలు తెలుసుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

జాతీయ సెలవులతో పాటు, కొన్ని రాష్ట్రాల నిర్దిష్ట సెలవులు దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పది రోజులపాటు సెలవులను ప్రకటించింది. ఈ పది రోజులలో శని ఆదివారాలతో పాటు కొన్ని ప్రత్యేక రోజులు కూడా ఉన్నాయి. నవంబర్ నెలలో బ్యాంకులు పనిచేయని తేదీల వివరాల గురించి తెలుసుకుందాం.

నవంబర్‌లో మొత్తం 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

2022 నవంబరు ఒకటవ తేదీన కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్ణాటకలో బ్యాంకుకి సెలవులు ప్రకటించింది.

నవంబర్ ఆరవ తేదీ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉన్న బ్యాంకులకు సెలవు ఉంటుంది.

8 నవంబర్ 2022 – గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ సందర్భంగా కూడా బ్యాంక్ లు మూతపడనున్నాయి.

అలాగే 11 నవంబర్ 2022 – కనకదాస జయంతి / వాంగ్లా పండుగ కారణంగా కర్నాటక, మణిపూర్ బ్యాంకులకు సెలవు ఉంటుంది.

12 నవంబర్ 2022 రెండవ శనివారం అవటంతో మొత్తం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

అలాగే నవంబర్ 13వ తేదీ ఆదివారం అవటంతో ఆ రోజు కూడా బ్యాంక్ కి సెలవు.
ఇక నవంబర్ 20 వ తేదీ కూడా ఆదివారం . అందువల్ల ఆ రోజు కూడా బ్యాంక్ సెలవు.

ఇక నవంబర్ 23వ తేదీ సెంగ్ కుట్సానెమ్ సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంక్ సెలవు.

నవంబర్ 26వ తేదీ నాలుగవ శనివారం సందర్భంగా బ్యాంక్ సెలవు.

అలాగే నవంబర్ 27వ తేదీ ఆదివారం కూడా బ్యాంక్ లు తెరుచుకోవు.

ఇలా నవంబర్ నెలలో మొత్తం ఎనిమిది రోజుల పాటు మన తెలుగు రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.