సాధారణంగా మనం బ్యాంకు నుంచి మన ఇంటిని లేదా ఆస్తులను తాకట్టుపెట్టి రుణం తీసుకుంటాము. అయితే ఆ రుణం చెల్లించని పక్షంలో బ్యాంక్ రుణ గ్రహీతలకు నోటీసులు జారీ చేసిన ఆ విషయంపై స్పందించకపోవడంతో తమ ఆస్తులను వేలం వేయడం మనకు తెలిసిందే. ఈ విధంగా ఎన్నో ఆస్తులతో పాటు ఇల్లు నగలను కూడా బ్యాంక్ వేలం వేస్తుంటారు. అయితే ఇలాంటి వేలంపాటలో చాలా తక్కువ ధరకే ఖరీదైన వస్తువులను ఆస్తులను సొంతం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా ఈ వేలం ప్రకటించబోతున్నట్లు అధికారక ఖాతా ద్వారా ప్రకటించారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎంతో విలువైనటువంటి ఇల్లు ఆస్తులను ఈ వేలంపాటలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.అయితే ఈ వేలం పాట కోసం మనం బ్యాంకు కాడ గంటల తరబడి నిరీక్షించాల్సిన పనిలేదు ఇంట్లో కూర్చొని వేలం పాటలో పాల్గొనవచ్చు. అయితే ఈ మెగా వేలంలో భాగంగా ఏ ఏ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆస్తులను వేలం వేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలంటే https://ibapi.in/Sale_info_Home.aspx లేదా https://www.bankofindia.co.in/Dynamic /Tender?Type=3 లింక్స్ మీద క్లిక్ చేస్తే చాలు ఏ ఏ ప్రాంతంలో ఎలాంటి ఆస్తులను వేలం వేస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది.
ఇక ఈ విషయంలో మీకు ఏ విధమైనటువంటి సందేహాలు తలెత్తిన 022- 66684884/ 66684862 నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను తీర్చుకోవచ్చు. ఇకపోతే ఈ వేలంపాటలో ఎలా పాల్గొనాలి అనే విషయానికి వస్తే ఐబీఏపీఐ (IBAPI) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. లేదంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. లేదంటే మీరు 750 687 1647, 750 687 1749 ఫోన్ చేసి కూడా ఈ వేలం పాటలో పాల్గొనవచ్చు. ఇక ఈ వేలంపాటను 2022 డిసెంబర్ 9వ తేదీ నిర్వహించనున్నారు.