విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ లేదని ఆలోచిస్తున్నారా… ఆధార్ కార్డుతో కూడా వెళ్లొచ్చు తెలుసా?

సాధారణంగా చాలామందికి ఇతర దేశాలలో పర్యటించాలనే కోరిక ఉంటుంది. అయితే పాస్ పోర్ట్ లేని కారణంగా వారి కోరికను అలాగే అణిచి వేసుకుంటూ ఉంటారు.అయితే పాస్ పోర్ట్ లేకుండా కొన్ని దేశాలలో పర్యటించవచ్చని చాలామందికి తెలియదు.అయితే పాస్ పోర్ట్ లేకుండా ఎలా ప్రయాణించాలి అనే విషయానికి వస్తే మనం భారతదేశ పౌరులమని మన ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డుతో సహా మనం కొన్ని దేశాలకు ప్రయాణం చేయవచ్చు మరి ఆ దేశాలు ఏంటి అనే విషయానికి వస్తే…

భూటాన్ నేపాల్ వంటి దేశాలకు వెళ్లాలనుకునే వారు పాస్ పోర్ట్ లేకుండా ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు ఆధారంగా ఈ దేశాలలో పర్యటన చేయవచ్చు ఇక చిన్న పిల్లలకైతే బర్త్ సర్టిఫికెట్ లేదవారు చదువుతున్న స్కూల్ కి సంబంధించి ఐడి ప్రూఫ్ తీసుకువెళ్తే చాలు మనం ఈ రెండు దేశాలలో పర్యటన చేయవచ్చు. ఇదే విషయం గురించి నేపాల్ ప్రభుత్వం మాట్లాడుతూ…మీ భారతీయ పౌరసత్వాన్ని రుజువు చేసే అటువంటి పత్రం మాత్రమే మాకు అవసరం.  మీ ఓటరు గుర్తింపు కార్డు లేదా భారతీయ పాస్‌పోర్ట్‌ను సమర్పించవచ్చని తెలియజేశారు.

ఇలా పాస్ పోర్ట్ లేకుండా కేవలం గుర్తింపు కార్డుతో భూటాన్ నేపాల్ మాత్రమే కాకుండా ఇంకా ఏ ఏ దేశాలలో పర్యటన చేయవచ్చు అనే విషయానికి వస్తే…. ప్రపంచవ్యాప్తంగా 58 ప్రాంతాలకు మనం వీసా లేకుండా పర్యటన చేయవచ్చు .మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, థాయిలాండ్, మకావో, భూటాన్, కంబోడియా, నేపాల్, కెన్యా, మయన్మార్, ఖతార్, ఉగాండా, ఇరాన్, సీషెల్స్ మరియు జింబాబ్వేలు వంటి ప్రాంతాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునేవారు వెంటనే ప్యాకప్ చెప్పేయండి.