వాట్సాప్ మెసేజ్ యాప్ లో మరొక అప్డేట్… వినియోగదారులకు ఇకపై ఆ అవకాశం కూడా..?

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇలా వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల కొత్త కొత్త ఫీచర్లను వాట్సాప్ సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికీ వాట్సాప్ యాప్ ద్వారా చాటింగ్, ఫోన్ కాల్, వీడియో కాల్, స్టేటస్ సెట్టింగ్, స్టేటస్ ప్రైవసీ వంటి ఫీచరర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా వాట్స్అప్ సంస్థ తన వినియోగదారుల కోసం సరికొత్త అప్డేట్ తీసుకువచ్చింది. వాట్సాప్ యాప్ ద్వారా ఇతరులకు ఫోటోలు పంపే సమయంలో ఆ ఇన్ఫర్మేషన్ ని బ్లాక్ చేసే అవకాశం వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.

వాట్సాప్ రూపొందించిన ఈ సరికొత్త ఫీచర్ చెక్‌ చేసుకునేందుకు… డెస్క్‌టాప్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేయాలి. వాట్సప్ యాప్ ద్వారా ఇతరులకు పంపే ఫొటోను సెలెక్ట్‌ చేసి ఎడిట్‌ టూల్స్‌లో బ్లర్‌ చేసే ఆప్షన్‌ కనిపిస్తే.. ఈ వాట్సాప్ సరికొత్త ఫీచర్ మీకు అందుబాటులో ఉన్నట్లే. వాట్సాప్ సంస్థ జూన్ లో పేర్కొన్న ఈ వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా అనే సరికొత్త ఫీచర్ ని ఇప్పుడు ప్రకటించింది. WABetaInfoలోని బ్లాగ్ పోస్ట్‌లో WhatsApp వినియోగదారులు ఇప్పుడు చిత్రాలలో లేదా సమాచారాన్ని సవరించడానికి, బ్లర్ చేయడానికి అదనపు సాధనాన్ని కలిగి ఉంటారని పేర్కొంది.

అయితే సరికొత్త ఫీచర్ లో వాట్సాప్ వినియోగిస్తున్న ఫోటోలపై వ్యక్తుల ఈ బ్లర్ టూల్‌ వర్తింపజేయవచ్చు. ప్రత్యామ్నాయ బ్లర్ ప్రభావాన్ని అందించడానికి WhatsApp రెండు బ్లర్ టూల్స్‌ను అభివృద్ధి చేసింది. అంతే కాకుండా ఈ ఫీచర్ వినియోగదారులు బ్లర్ సైజు, గ్రాన్యులర్ ఖచ్చితత్వాన్ని కూడా ఎంచుకొని అవకాశం వాట్సప్ సంస్థ కల్పించింది. ఇటీవల మెటా యాజమాన్యం వాట్సాప్ చాట్‌లను సరదాగా చేయడానికి, ప్రొఫైల్ చిత్రాన్ని ప్రత్యేకంగా ఉంచడానికి స్నాప్‌చాట్ బిట్‌మోజీ వంటి అవతార్ ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.