రయ్యి మంటు గాలిలో ఎగురుతున్న ఎయిర్ టాక్సీ..?

ప్రస్తుత కాలంలో దేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది . ఈ క్రమంలో మనషుల అవసరాలకు అనుగుణంగా అనేక వినూత్న పరికరాలు, యంత్రాలు, వాహనాలు తయారు చేస్తున్నారు. దశాబ్దం క్రితం టూజీ, త్రీడీ నెట్‌వర్క్ వాడిన మనం.. ఇప్పుడు పైవ్‌జీ వాడేస్తున్నాం. ఇలా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రయాణం కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. అందువల్ల టాక్సీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆటోలు, ఉబర్‌ క్యాబ్‌లు, బైక్‌ ట్యాక్సీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఇప్పుడు రోడ్డు మీద నడిచే టాక్సీలు మాత్రమే కాకుండా గాలిలో ఎగిరే టాక్సీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ధనవంతులు ప్రైవేటు జెట్‌ విమానాలను అద్దెకు తీసుకొని అలా విహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇవి కొందరికే అందుబాటులో ఉన్నా. రానురాను.. మరింత మందికి చేరువ కానున్నాయి. ఈ మేరకు 2026 నాటికి దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు.

ఫ్లైయింగ్ ట్యాక్సీల డిజైన్లకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.., ఎయిర్ ట్యాక్సీలు దిగేందుకు అనువైన వెర్టిపోర్టుల నిర్మాణం మరో మూడేళ్లలో సాకారం కానుందని వెల్లడించారు. ఈ ఎయిర్ ట్యాక్సీలతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా..ప్రయాణ వ్యవధి కూడా తగ్గిపోతోంది. అయితే వీటి చార్జీలు ఊబర్ రైడ్ తో పోల్చితే కూడా చవకగానే ఉంటాయని… దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ చీఫ్ అహ్మద్ బెహ్రోజియన్ వెల్లడించారు. దుబాయ్ లో ఈ ఎయిర్ ట్యాక్సీలను 240 కి.మీ పరిధిలో నడపనున్నారు. ఈ ఎయిర్ టాక్సీలా గరిష్ఠ వేగం గంటకు 300 కి.మీ. వీటి ద్వారా దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణ వ్యవధి తగ్గిపోతుందని ఆయన వెల్లడించారు.