మొబైల్ లో వైఫై కాలింగ్ యాక్టివేట్ చేయాలా.. అయితే ఇలా చేయండి…?

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ తో వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ ఉపయోగించాలి అంటే నెట్వర్క్ తప్పనిసరిగా ఉండాలి. నెట్వర్క్ లేకపోతే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఫోన్ ఉపయోగించలేరు. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడటానికి చాటింగ్ చేయడానికి నెట్వర్క్ చాలా ముఖ్యం. అయితే నెట్వర్క్ లేకపోవటం వల్ల కాల్ కట్ అవడం లేదా అవతలి వ్యక్తి మాటలు సరిగ్గా వినిపించకపోవడం వంటి కాల్ డ్రాప్ సమస్యలు తలెత్తుతాయి.

అయితే ఇటువంటి పరిస్థితులలో వైపై కాలింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ వైఫై కాలింగ్ ఆప్షన్ ఉపయోగించుకోవటానికి వైఫై నెట్వర్క్ తప్పనిసరిగా ఉండాలి.ఈ వై-ఫై కాలింగ్‌ అనేది VoLTE టెక్నాలజీకి బదులు VoIP టెక్నాలజీని ఉపయోగించి కాల్స్ కనెక్ట్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నెట్వర్క్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఇటీవల మార్కెట్లోకి వస్తున్న అన్ని రకాల స్మార్ట్ ఫోన్ లలో వై-ఫై కాలింగ్‌ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ ఆప్షన్‌ లేకపోతే వైఫై ద్వారా కాల్స్ చేయడం కుదరదు. తరచూ కాల్ డ్రాప్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వైఫై కాలింగ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆండ్రాయిడ్ ఫోన్లో వైఫై కాలింగ్ కనెక్ట్ చేయడం ఎలా :

• స్మార్ట్ ఫోన్ లో వైఫై కాలింగ్ ఆక్టివేట్ చేయడానికి ముందుగా సెట్టింగ్స్‌ మెనూకు వెల్లి ఆ తరువాత నెట్‌వర్క్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

• ఇక నెట్‌వర్క్‌ సెక్షన్‌కు ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఉన్న వై-ఫై ప్రిఫరెన్స్‌ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

• ఆ తర్వాత వై-ఫై కాలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. మీ ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు ఉంటే.. వాటిలో మీకిష్టమైన సిమ్‌ కార్డుకి వైఫై కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఐఫోన్ లో వై-ఫై కాలింగ్‌ ఆప్షన్‌ యాక్టివేట్‌ చేయడం ఎలా?

• ఐఫోన్ లో వైఫై కాలింగ్ ఆప్షన్ యాక్టివేట్ చేయటానికి ముందుగా సెట్టింగ్స్‌కు వెళ్లి ఫోన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

• ఆ తర్వాత ‘మొబైల్‌ డేటా’ ఆప్షన్ పై క్లిక్ చేసి వై-ఫై కాలింగ్‌ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఐ ఫోన్లో వైఫై కాలింగ్ కనెక్ట్ అవ్వాలి అంటే మీ టెలికాం ఆపరేటర్ సపోర్ట్ చేయవలసి ఉంటుంది.

• ఆ తర్వాత వై-ఫై కాలింగ్‌ ఆన్‌ దిస్‌ ఐఫోన్‌ ఫీచర్ టర్న్ ఆన్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేశాక.. మీ ఫోన్‌లోని స్టేటస్‌ బార్‌లో టెలికాం ఆపరేటర్స్ నేమ్ కింద వై-ఫై అని కనిపిస్తుంది. ఇలా మీ ఫోన్ లో యాక్టివేట్ చేసుకోవచ్చు..