ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాల మేరకు సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సప్ మరొక ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ లో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను మ్యూట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. వాట్సాప్ (WhatsApp) సెట్టింగ్స్ సెక్షన్ లో ఇందుకు సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ సైలెన్స్ అయిపోతాయి. అయితే అవి కాల్స్ లిస్ట్, నోటిఫికేషన్ సెంటర్‌లో కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఆప్షన్ వల్ల స్పామ్ కాల్‌లకు చెక్ పడుతుంది.
అంతే కాకుండా వాట్సాప్ లో ఇప్పటి వరకూ వినియోగదారుడు ఏదైనా వీడియో రికార్డ్ చేయాలంటే ట్యాప్ అండ్ హోల్డ్ బటన్ వినియోగించేవారు. అయితే ఇప్పుడు దీనిని వాట్సాప్ పూర్తిగా అప్ డేట్ చేసి కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ట్యాప్ అండ్ హోల్డ్ స్థానంలో ప్రత్యేకంగా వీడియో మోడ్ ను ఆవిష్కరించింది.దీని ద్వారా వాట్సాప్ కాల్ నుంచి వీడియో మోడ్ కు ఎలా స్విచ్ అవుతున్నారో ఫోటో నుంచి వీడియో కి ఇలా స్విచ్ అయ్యే వెసులుబాటు కల్పించింది. అలాగే చాట్ బ్యాకప్ కష్టాలను కూడా వాట్సాప్ తొలగించి
సులువుగా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది.
త్వరలోనే ‘చాట్ ట్రాన్స్‌ఫర్'(Chat Transfer) అనే ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుండి. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు సులువుగా మెసేజ్‌లను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే యూజర్లు తమ చాట్ హిస్టరీని ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మరో ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. క్యూఆర్(QR Code) ద్వారా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయగలిగేలా ఫీచర్‌ని ఎనేబుల్ చేయనుంది. యూజర్లు తమ డేటాని ఏ స్మార్ట్‌ఫోన్‌కి సెండ్ చేయాలని అనుకుంటున్నారో.. ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. దీంతో ప్రస్తుతం వినియోగిస్తున్న డివైజ్ నుంచి చాట్ హిస్టరీ కొత్త డివైజ్‌లోకి బదిలీ అవుతుంది.