హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ స్కోర్ చేసే సత్తాలేదని, ఆ జట్టు బ్యాటింగ్ సామర్థ్యం 150 పరుగులకే సరిపోతుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల ఆరెంజ్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం బౌలర్లు కూడా చెలరేగడంతో హైదరాబాద్ 69 పరుగులతో పంజాబ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపు విషయాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్ అభిమానులు సెహ్వాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఏ జట్టును తక్కువ అంచనా వేయవద్దని, నిన్నటి మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ సత్తా తెలిసిందా? అని చురుకలంటిస్తున్నారు.
అసలు విషయం ఎంటంటే..?
గత ఆదివారం షార్జా వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో సెహ్వాగ్ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టుకు ధాటిగా ఆడే సత్తాలేదని, భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ముందు తేలిపోతుందని అవహేళన చేశాడు. చిన్న మైదానమైన షార్జాలో మ్యాచ్ జరుగుతుండటం సన్‌రైజర్స్ ప్రతీకూలాంశమన్నాడు. ముంబై నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక సన్‌రైజర్స్ చేతులెత్తేస్తుందని ఎగతాళి చేశాడు. క్రిక్‌బజ్ రిపోర్టర్ గౌరవ్ కపూర్‌తో మాట్లాడుతూ సెహ్వాగ్ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తేలిపోతుంది. ముంబైని ఢీకొట్టలేక చేతులెత్తేస్తుంది. ఎందుకంటే ఆ జట్టులో 200-250 పరుగులు చేయగల పవర్ హిట్టర్లు లేరు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సామర్థ్యం 150 పరుగులకే సరిపోతుంది. అదే ముంబై తొలుత బ్యాటింగ్ చేస్తే 200కు పైగా రన్స్ చేస్తుంది. ఇరు జట్లు సమతూకంగా లేకపోవడంతో మ్యాచ్ వన్‌సైడ్ కానుంది’అని సెహ్వాగ్ కామెంట్ చేశాడు.
ఇప్పుడేం అంటావ్ సెహ్వాగ్?
అయితే ఆ మ్యాచ్‌లో ముంబై 208 రన్స్ చేయగా.. హైదరాబాద్ 174 రన్స్‌కు పరిమితమైంది. కానీ సెహ్వాగ్ మ్యాచ్ వన్‌సైడ్ మాత్రం కాలేదు. విజయం కోసం ఆరెంజ్ ఆర్మీ శ్రమించింది. ఇక తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ చెలరేగడంతో అభిమానులు సెహ్వాగ్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడేం అంటావ్ సెహ్వాగ్.. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సత్తా తెలిసిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఫన్నీ మీమ్స్, కామెంట్స్, వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. మరొకసారి సన్‌రైజర్స్‌పై నోరు జారకుండా ఈ డాషింగ్ ఓపెనర్‌కు సోషల్ మీడియా వేదికగా బుద్ది చెబతున్నారు.