RCB అభిమానుల్లోకి తిరిగి వచ్చిన ఉత్సాహం:ఈ సారి కప్పు మాదే!

Royal Challengers beat Sunriser

ఐపీఎల్ 13వ ఎడిషన్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Royal Challengers beat Sunrisers hyderabad
Royal Challengers beat Sunrisers hyderabad

బెంగళూరు తమ ముందుంచిన 164 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోవడానికి దూకుడుగానే మొదలెట్టింది సన్ రైజర్స్ ఓపెనర్ల జంట వార్నర్..బెయిర్ స్టో. మొదటి బంతినే బౌండరీకి తరలించిన వార్నర్ తరువాత మరో రెండు పరుగులు చేశాడు. అయితే, రెండో ఓవర్ లో వార్నర్ కు దురదృష్టం ఎదురొచ్చింది. ఉమేష్ యాదవ్ వేసిన నాలుగో బంతికి బెయిర్ స్టో చేయి అడ్డు పెట్టాడు.. సరిగ్గా ఆబంతి నాన్ స్ట్రయికర్ వైపు వికెట్లను ఎగరగోట్టింది. అప్పటికే రన్ కోసం క్రీజు బయటకు వచ్చిన వార్నర్ అనవసరంగా రనౌట్ అయి వెనుతిరిగాడు. దీంతో రెండో ఓవర్ ముగిసే సరికి 18 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయి ఆత్మరక్షణలో పడిపోయింది. ఈదశలో బ్యాటింగ్ కి వచ్చాడు మనీష్ పాండే. జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు వీరిద్దరూ. ఉమేష్ యాదవ్ ఐదో ఓవర్‌లో మనీష్‌ పాండే తొలి రెండు బంతులను బౌండరీలు తరలించాడు. తర్వాత సింగిల్‌ తీసివ్వగా బెయిర్‌స్టో సైతం ఒక పరుగు తీశాడు. దీంతో ఈ ఓవర్‌లో 10 పరుగులు లభించాయి. మొత్తానికి 5 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 40/1గా నమోదైంది. తరువాత కూడా ఇద్దరూ ఆచి తూచి ఆడారు. దీంతో పదో ఓవర్ గడిచేసరికి ఒక్క వికెట్ నష్టానికి 78 పరుగులు చేయగలిగింది సన్ రైజర్స్. బెయిర్‌స్టో(39), మనీష్‌ పాండే(31) పరుగులతో రెండో వికెట్ కు వీరిద్దరూ 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

కుదురుకున్న ఈ జోడీని చాహల్ తాను వేసిన 12వ ఓవర్లో విడదీశాడు. మనీష్ పాండే (34) భారీ షాట్‌ ఆడబోయి నవదీప్ సైనీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో హైదరాబాద్‌ 89 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. బెయిర్‌స్టో(43)తో కలిసి మనీష్ విలువైన 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తరువాత ప్రీయమ్‌ గార్గ్‌ క్రీజులోకి వచ్చాడు. తరువాత బెయిర్ స్టో తన అర్ధ సెంచరీ పూర్తీ చేసుకున్నాడు. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్ స్కోరు 108/2కి చేరింది. తరువాత బెయిర్ స్టో 61 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. కీలక సమయంలో చాహల్‌.. బెయిర్‌స్టో(61)ను ఔట్‌ చేశాడు. 16వ ఓవర్‌ రెండో బంతికి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. బెయిర్ స్టో అవుతయ్యిన తరువాత విజయ్ శంకర్‌ ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్‌ 121 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది.

శివమ్‌ దూబే వేసిన 17వ ఓవర్‌లో రెండు వికెట్లు పడ్డాయి. తొలుత మూడో బంతికి ప్రీయమ్‌గార్గ్‌(12) బౌల్డ్‌ అవ్వగా, తర్వాత చివరి బంతికి అభిషేక్‌ శర్మ(7) రనౌటయ్యాడు. దీంతో హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. గార్గ్ కూడా దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాడు. దూబే వేసిన బంతిని రివర్స్లో ఆడబోయాడు బంతి బ్యాట్ కు కనెక్ట్ అయ్యి వికెట్ల మీద పడింది దీంతో అతను అవుట్ అయ్యాడు.

ఇక నవ్‌దీప్‌ సైని వేసిన 18వ ఓవర్‌లో మరో రెండు వికెట్లు పడ్డాయి. తొలుత నాలుగో బంతికి భువనేశ్వర్‌కుమార్‌(0) బౌల్డవ్వగా చివరి బంతికి రషీద్‌ఖాన్‌(6) బౌల్డయ్యాడు. దీంతో 18 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 142/8గా నమోదైంది. ఈ ఓవర్‌లో సైని 5 వైడ్లు వేశాడు వేయడం విశేషం. శివమ్‌ దూబె వేసిన 19వ ఓవర్‌ రెండో బంతికి మిచెల్‌ మార్ష్‌ ఔటయ్యాడు. దాదాపుగా విజయానికి దూరమయ్యే పరిస్థితికి వెళ్ళిపోయింది సన్ రైజర్స్. చివరి ఓవర్లో సన్ రైజర్స్ చివరి వికేట్ కూడా కోల్పోయింది. హైదరాబాద్‌ను 153 పరుగులకు ఆలౌట్‌ అవడంతో కోహ్లీసేన 10 పరుగులతో విజయం సాధించింది.