తొలి టెస్ట్‌లో ఘోరంగా విఫలమైన భారత జట్టు రెండో టెస్ట్ గెలిచి పరువు నిలుపుకోవాలని బరిలోకి దిగింది. బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిషాక్ ఇచ్చాడు. ఓపెనర్ జో బర్న్స్‌ను డకౌట్‌గా పెవీలియన్‌కు పంపాడు. ఒక ఎండ్‌లో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్ బౌలర్స్‌ని ఇబ్బందిపెడుతున్న సమయంలో అశ్విన్ రెండో ఎండ్‌లో బరిలోకి దిగాడు. ఈ స్పిన్నర్ తన స్పిన్ మాయాజాలంతో మంచి ఫాంలో ఉన్న వేడ్‌ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తొలి బాల్ నుండే చాలా ఇబ్బందిగా కనిపించాడు. స్మిత్‌పై మంచి రికార్డ్ ఉన్న అశ్విన్ మరోసారి అతనిని తన బుట్టలో వేసుకొని డకౌట్‌గా పెవీలియన్‌కు పంపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 29 బంతులాడి కేవలం ఒక పరుగుకే అశ్విన్ బౌలింగ్‌లో రహానెకి క్యాచ్ ఇచ్చి ఔటైన స్టీవ్‌స్మిత్.. రెండో టెస్టులో 8 బంతులాడి అశ్విన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కాని స్మిత్‌కు అశ్విన్ వేసిన బంతిపై విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు మిడిల్ స్టంప్ లైన్‌పై బాల్ విసిరిన అశ్విన్.. స్టీవ్ స్మిత్ శరీరంపైకి టర్న్ చేశాడు. దీంతో బంతిని స్వ్కేర్ లెగ్ దిశగా హిట్ చేసేందుకు స్టీవ్‌స్మిత్ ప్రయత్నించాడు. కానీ. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి లెగ్ స్లిప్‌లో ఉన్న పుజారా చేతిలో పడింది.
మెల్బోర్న్లో స్టీవ్ స్మిత్‌కు మంచి రికార్డ్ ఉంది. ఓ టెస్ట్ మ్యాచ్ లో 192,14 పరుగులు చేయగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరగడం గమనర్హం. ప్రస్తుతం క్రీజులో లబుషేన్(27), హెడ్(7 ) ఉన్నారు. 30 ఓవర్లకు గాను ఈ టీం 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. అప్పుడు మిగతా రెండు మ్యాచ్‌లపై మరింత ఆసక్తి పెరగనుంది.