IPL- 2020: అబుదాబిలో సూర్య కుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. వన్ మ్యాన్ షోతో ముంబై జట్టును గెలిపించి.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేశాడు. బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది ముంబై ఇండియన్స్. బెంగళూరు విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. సూర్యకుమార్ 43 బంతుల్లో 79 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో మూడు సిక్స్‌లు, 10 ఫోర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 25, డికాక్ 18, హార్దిక్ పాండ్యా 17, కృనాల్ పాండ్యా 10, సౌరబ్ తివారి 5, పొలార్డ్ 4 పరుగులు చేశారు. వికెట్లు పడుతున్నా..సూర్య కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2, యుజ్వేంద్ర చాహల్ 2, క్రిస్ మోరిస్ ఒక వికెట్ పడగొట్టాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. భారీగా స్కోర్ చేస్తుందనుకున్న కొహ్లీ సేన.. ఆఖరి ఓవర్లలో తడబడడంతో తక్కువ స్కోర్ చేసింది. దేవదత్ పడిక్కల్ 74 పరుగులతో సత్తా చాటాడు. జోష్ ఫిలిప్ 33 రన్స్ చేశాడు. ఆర్సీబీ ఓపెనర్లు ఫిలిప్, పడిక్కల్ జట్టుకు శుభారంభం ఇచ్చారు. 71 రన్స్ వద్ద ఫిలిప్, 95 వద్ద కొహ్లీ ఔట్ అవడంతో స్కోర్ వేగం తగ్గింది. ఆ తర్వాత 16, 17, 18 ఓవర్లలో ఏకంగా నాలుగు వికెట్లు పడడంతో.. బెంగళూరు స్కోర్ 164కు పరిమితమయింది. లేదంటే బెంగళూరు 200 పరుగులు చేసేది. ఆఖరులో ముంబై బౌలర్లు విజృంభించడంతో స్కోర్ తగ్గిపోయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక బౌల్ట్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.
That's that from Match 48 as @mipaltan win by 5 wickets.@surya_14kumar with an unbeaten 79.
Scorecard – https://t.co/XWqNw97Zzc #Dream11IPL pic.twitter.com/ESHhCYRBik
— IndianPremierLeague (@IPL) October 28, 2020
ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, ముంబై జట్లు 27 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించగా.. 10 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలిచింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు జట్లు ఓసారి తలపడ్డాయి. సెప్టెంబరు 28న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై, బెంగళూరు జట్లు 201 పరుగులు చేశాయి. సూపర్ ఓవర్లో కొహ్లీ సేన గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుంది ముంబై. అంతేకాదు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంది.