రాయల్ చాలెంజర్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

ఐపీఎస్ 12వ సీజన్‌లో ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ టీంని ధోని చెన్నై సూపర్ కింగ్స్ సేన 17.1 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే ఇచ్చి ఆలౌట్ చేసింది.

హర్భజన్‌సింగ్ 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజా 15 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇమ్రాన్ తాహిర్ 9 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయ లక్ష్యాన్ని ఛేదించింది. 

చెన్నై బ్యాట్స్‎మెన్స్‎లో వాట్సన్ డక్ అవుట్ కాగా రాయుడు 28, రైనా 19 పరుగులు చేసి అవుటయ్యారు. జడేజా 6, జాదవ్ 13 రన్స్‌తో నాటౌ‌ట్‌గా నిలిచారు. తొలుత బ్యాంటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌లో పార్థివ్ పటేల్ (39) మినహా అందరూ చేతులేత్తేశారు. బెంగళూరు బ్యాటింగ్‌లో ఇవే అత్యధిక పరుగులు. కోహ్లీ 6, మొయిన్ అలీ 9, ఏబీ డివిలియర్స్ 9, హెట్‌మెయిర్ డకౌట్ అయ్యారు. ఇలా కీలక ఆటగాళ్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్‌కు 3, ఇమ్రాన్ తాహిర్‌కు 3, జడేజాకు 2, డ్వాన్ బ్రావోకు 1 వికెట్ దక్కింది.