Bengaluru Stampede: బెంగళూరు విషాద ఘటనపై స్పందించిన కమల్ హాసన్.. ట్వీట్ వైరల్!

Bengaluru Stampede: తాజాగా ఆర్సీబీ గెలిచింది అన్న ఆనందం కంటే స్టేడియం బయట జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఎక్కడ చూసినా కూడా బెంగళూరు విషాద ఘటన గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆర్సీబీ గెలిచింది అన్న ఆనందంలో తొక్కిసలాట జరగగా ఇందులో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది చనిపోవడం నిజంగా విషాదకరం అని చెప్పాలి. ఇప్పటికే ఈ ఘటనపై చాలామంది స్పందించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ ఘటనపై హీరో కమల్ హాసన్ సైతం స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేశారు కమల్ హాసన్. ఆ ఘటన తనను తీవ్రంగా కలిసి వేసిందని, ఆ సంఘటన నిజంగా హృదయ విదారకంగా అనిపించిందని, తాను తీవ్రమైన బాధలో ఉన్నట్లు రాసుకొచ్చారు కమల్ హాసన్. అలాగే బాధిత కుటుంబాలకు ఈ దుఃఖ సమయంలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అని తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఇప్పటికే ఆర్సిబి ఈ ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దెబ్బలు తగిలి హాస్పిటల్ లో కోలుకుంటున్నా వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపింది. ఇకపోతే కమల్ హాసన్ విషయానికి వస్తే..నిన్న మొన్నటి వరకు కూడా కమల్ హాసన్ వివాదంతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కన్నడ వివాదం కారణంగా కమల్ హాసన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. అయితే కన్నడ భాషపై ఆయన కామెంట్స్‌ వివాదానికి దారి తీయడంతో కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. ఇప్పటికే థగ్‌ లైఫ్‌ మూవీ కన్నడ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.