ఫొటోలో కనిపిస్తున్న విగ్రహం ఎవరిదో తెలుసా? భారతదేశానికి వన్నెతెచ్చిన ఆ క్రికెటర్ కు ఏ గతి పట్టిందో తెలుసా? పూర్తి వివరాలు కింద చదవండి.
దేశం గర్వించదగ్గ ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడైన కల్నల్ సి.కే. నాయుడు కు లభించిన గొప్ప సన్మానం ఇది. అసలు అతను సాథించిన విజయాలు ఏమిటో ఈ తరం పాలకులకు, నాయకులకు, అథికారులకు అసలు కనీస అవగాహన ఉందా?
మచిలీపట్నం కే మకుటాయమానమైన వ్యక్తి సికె నాయుడు. తెలుగు వారికి గర్వకారణం. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి. అటువంటి ఘనమైన వ్యక్తి తాలూకు విగ్రహాన్ని ఎలా ఉంచారో చూడండి. ఆయన గుర్తుగాను, గౌరవంతో స్థాపించిన అయన విగ్రహం ఈరకంగా బలియైపోవటం దారుణం కదా.
ఇది మచిలీపట్నంలో జరిగిన సంఘటన. దీనికి స్థానిక మునిసిపాలిటీ, కృష్ణా జిల్లా పాలకులు, అథికారులు సిగ్గు పడాల్సిన విషయం అని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. ఇకనైన తప్పు తెలుసుకుని సదరు కల్నల్ సి.కే.నాయుడు విగ్రహం మరలా యథాస్థానంలో గౌరవ మర్యాదలతో పునరుద్ధరణ చేయాలని మా డిమాండ్.
* రచయిత : బూరగడ్డ అశోక్ కుమార్, న్యాయవాది, మచిలీపట్నం.