మస్ట్ రీడ్: పవన్ ఆవిర్భావదినోత్సవ ప్రసంగానికి రిజల్ట్ వచ్చేసింది!

గతంలో (మస్ట్ రీడ్: కాపు – కాపు… మధ్యలో పవన్!) విశ్లేషించినట్లుగానే పవన్ కల్యాణ్ జనసేనలో రెండు రకాల కాపులు ఉంటారు. వారిలో ఒకరు.. పవన్ ఏమి చెప్పినా కరెక్ట్.. ఏమి చేసినా కరెక్ట్ అనుకునేవారు. పవన్ వినిపించిన ప్రతీసారీ కేకలు వెయడం.. కనిపించిన ప్రతీసారీ ఈలలు వేయడం.. దగ్గరకొచ్చిన ప్రతీసారి “అన్నయ్యా సెల్ఫీ” అని అరవడం వారి నిత్యకృత్యం! వీరివల్ల పవన్ కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రయోజనం అంటారా…? ఓటు హక్కు ఉంటే మాత్రం కచ్చితంగా జనసేనకే వీరి ఓటు! వీరు కాకుండా మరోరకం జనం జనసేనలో ఉంటారు.

వీరికి పవన్ పై గౌరవం, ఒకే సామాజికవర్గం వారనే అభిమానం ఉంటాయి తప్ప.. నమ్మకం తక్కువగా ఉంటుంది! దానికి పవన్ ప్రవర్తన కూడా ఒక కారణం. వీరంతా… పవన్.. కాపు సామాజికవర్గానికి రాజ్యాధికారం తేవాలని, కాపు సమాజానికి రాజకీయంగా పెద్ద దిక్కుగా ఉండాలని ఆశిస్తుంటారు. అయితే వీరికి ఆశలకు అనుగుణంగా పవన్ ప్రవర్తించని పక్షంలో.. బాదపడుతుంటారు.. ప్రత్యామ్నాయల వైపు చూస్తుంటారు. అది కూడా దాటేసిన పవన్… “కమ్మ సామాజికవర్గానికి మనం దన్నుగా ఉండాలి” అని స్టేట్స్ ఇస్తేమాత్రం… దయాదాక్షిణ్యాలు లేకుండా “బై బై” అని చెప్పేస్తారు! అలాంటి ఒక నాయకుడు తాజాగా వెలుగులోకి వచ్చారు.

అవును… విజయవాడలోని ఆకుల కిరణ్ కుమార్ అనే నాయకుడు జనసేనలోని కీలకమైన వ్యక్తుల్లో ఒకరు. జనసేన పార్టీ తరఫున టీవీ డిబేట్లలో పాల్గొనే స్థాయి గల తక్కువ మందిలో ఆయన కూడా ఒకరు. చాలా మందిలాగా నోరేసుకుని పడిపోవడం, అడ్డదిడ్డంగా వాదించడం కాకుండా.. పాయింట్ మాట్లాడతారని కూడా ఆయనకు పేరుంది. అలాంటి కిరణ్ కుమార్… తాజాగా జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇది ప్రస్తుతం జనసేనలో హాట్ టాపిక్ గా మారింది.

పోనీ భారి అవకాశం వచ్చింది.. బలమైన పార్టీలు ఆశ్రయం ఇస్తానన్నాని, భవిష్యత్తుపై భరోసా ఇచ్చాయి అందామనుకుంటే… ఆయన చేరిది బీజేపీ లో! రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోగల బలం లేకపోవడం మాత్రమే కాకుండా… ప్రతీ ఎన్నికల్లోనూ నోటాతో పోటీపడి కూడా చతికిలపడిపోయేటంత బలం ఉన్న బీజేపీ లో ఆయన చేరడం మరో షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. దీనికి కారణాలు వెతికే పనిలో ఉన్న అభిమానులు – ఆ కారణాలపై ఒక స్పష్టత వచ్చిన విశ్లేషకులు.. ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా మచిలీపట్నం సభలో పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన కమ్మబంధం, కుల సమీకరణలు.. రంగాకు తాను టీ సప్లయి చేశానని అసత్యాలు చెప్పుకోవడంతోపాటు.. వంగవీటి రంగా కమ్మవారి అమ్మాయిని పెళ్లిచేసుకున్నారని చెప్పడాలు.. కమ్మ – కాపు కలిసి రాజకీయం చేయాలని.. ఫలితంగా కమ్మ సామాజికివర్గానికి “కాపు”కాయాలని పవన్ చెప్పడమే ఆకుల కిరణ్ రాజినామాకు కారణం అని తెలుస్తుంది.

అంటే… రాష్ట్రంలో రాజకీయంగా ప్రస్తుతానికి అతీగతీ లేని బిజెపిలోకి వెళ్లడానికైనా సిద్ధపడుతున్నారు గానీ.. జనసేనలో ఉండడానికి మాత్రం పైన చెప్పుకున్న “కాపు” అసలు ఇష్టపడడం లేదన్నమాట. అంటే… పవన్ మాటలమీద ఆ సామాజికవర్గంలో సామాజిక మేలుకోరేవారు ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారన్నది ఇట్టే అర్ధం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. సో… పవన్ ఆవిర్భావదినోత్సవ ప్రసంగానికి ఇది మొదటి ఫలితం అన్నమాట! పవన్ మారని పక్షంలో… ఎన్నికలు సమీపించేనాటికి ఇలాంటి ఫలితాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయనడంలో సందేహం ఉండదనేది ఈ సందర్భంగా వినిపిస్తున్న మరో మాట!