మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయిజ మాసంలో వచ్చే చివరి పండుగను దీపావళి పండుగగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. ఇకపోతే ఈ ఏడాది అక్టోబర్ 24న దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు. ఇకపోతే దీపావళికి ముందు రోజు వచ్చే పండుగను నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఇలా నరక చతుర్దశి రోజు కూడా పెద్ద ఎత్తున దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. మరి నరక చతుర్దశి రోజు పూజ చేయడానికి అనువైన సమయం ఏది ఎలా పూజ చేయాలి అనే విషయానికి వస్తే…
నరుక చతుర్దశి రోజు శ్రీకృష్ణుడు కాళికాదేవి యమదేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడానికి అనువైన సమయం ఏంటి అనే విషయానికి వస్తే..అక్టోబర్ 23న సాయంత్రం 06:03 గంటలకు ప్రారంభమవుతుంది. నరక చతుర్దశి తిథి అక్టోబర్ 24 సాయంత్రం 05:27 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 24న నరక చతుర్దశి దీపావళి ఒకే రోజు వచ్చాయి.అభ్యంగ షన్న ముహూర్తం – 24 అక్టోబర్ 2022 ఉదయం 5:08 నుండి 6:31 వరకు. వ్యవధి – 01 గంట 23 నిమిషాలు.
ఇక నరక చతుర్దశి రోజు ఉదయమే నిద్రలేచి తలంటూ స్నానం చేసిన అనంతరం శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి.ఇక ఈరోజు సాయంత్రం పిండితో దీపాలను తయారు చేసి నలువైపులా దీపాలను వెలిగించి యమ ధర్మరాజుకు ప్రత్యేక పూజలు చేయాలి. ఇక నరక చతుర్దశి రోజు దీపం వెలిగించే సమయంలో
మృత్యునాం దండపాశాభ్యాం కాలేన్ శ్యామయ సహ
త్రయోదశ్యాం దీపనాత్ సూర్యజః ప్రీతం మామ్||
మంత్రాన్ని పఠించి దీపాన్ని వెలిగించండి. ఇక నరక చతుర్దశి రోజు శ్రీకృష్ణుడు కాళీమాత శివుడు విష్ణు విగ్రహాలను ఇంటికి ఈశాన్య దిశలో ప్రతిష్టించి పూజలు చేయాలి. ఇక నరక చతుర్దశి రోజు యమదేవునికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల ఆకాలమరణం తొలగిపోతుంది.ఇక పాపాలు నుంచి విముక్తి పొందాలంటే తప్పనిసరిగా ఇంటి ప్రధాన గుమ్మం ఇరువైపులా దీపం వెలిగించి పూజ చేయడం ఎంతో మంచిది.