టీఆర్పీ కోసం ఆది, వర్ష ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా…?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లు ప్రేక్షకులను ఎంతగా కట్టుకుంటున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అంతే కాకుండా పండగ సందర్భాలలో మల్లెమాల వారి నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో వినాయకచవితి సందర్భంగా మల్లెమాలవారు మన ఊరి దేవుడు అంటూ కొత్త ఈవెంట్ ప్రసారం చేయనున్నారు. ఇటీవల ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో లు కూడా విడుదల చేశారు.

ఈ ఈవెంట్ లో జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ లు తెగ సందడి చేశారు. ఈ ఈవెంట్ లో నాగినీడు, కృష్ణ భగవాన్, జయసుధ, ప్రణతి, ఇంద్రజ, కుష్బూ వంటి సీనియర్ నటి నటులు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్ లో ప్రదీప్ తన యాంకరిగ్ తో మరింత రెచ్చిపోయాడు. అయితే ఎప్పటిలాగే ఈ ఈవెంట్ కోసం మల్లెమాల వారు అర్టిస్ లతో సాహసాలు చేయించారు. జబర్థస్త్ కామెడియన్స్ చేత బిచ్చగాళ్ల లా వేషం వేయించి రోడ్డు మీద వదిలేశారు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ మాదిరిగా చేతుల మీద కార్లు ఎక్కుంచుకొని ట్యూబ్ లైట్ తో కొట్టుకున్నారు.

ఈ క్రమంలో ఇమ్యన్యుల్, వర్ష ప్రేమలో ఎంత నిజముందో తెలియచేయటానికి ఇమన్యుల్ చేతుల మీద కార్లు పోనిచ్చుకున్నాడు. ఈ క్రమంలో వర్ష ని కూడా ఇలాంటి సాహసం చేయమంటే నీ ప్రేమ వద్దు, నువ్వు వద్దు అని వెళ్ళిపోతుంది. ఇక మరోక సందర్భంలో వారి ప్రేమను నిరూపించుకోవడానికి అది వారిద్దరికి ట్యూబ్ లైట్స్ తో కొట్టుకోమని చెప్పాడు. వారిద్దరు కూడా ఎందుకు నిరాకరించారు. దీంతో ఆది ట్యూబ్ లైట్ తో ఇమాన్యుల్ వీపు మీద బలంగా కొట్టాడు. వెంటనే వర్ష నా ఇమ్ము నే కొడతావా అంటూ ఆది ని ట్యూబ్ లైట్ తో కొడుతోంది. ఆది కూడా ఏమాత్రం తగ్గకుండా వర్ష వీపు మీద ట్యూబ్ లైట్ తో కొడతాడు. అయితే వీరందరూ ఏదో పెద్ద దెబ్బ తగిలినట్టు టీఆర్పీ కోసం ఓవర్ యాక్షన్ చేశారు. ఇలాంటి ఓవరాక్షన్ పనులు జనాలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి.