వద్దని మొత్తుకున్నా సాయి పల్లవికి షాకిచ్చారుగా..!

ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో యంగ్ అండ్ నాచురల్ హీరోయిన్ సాయి పల్లవి ఫస్ట్ ప్లేస్ లోకి ఇప్పుడు వచ్చేసింది అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ఇప్పుడు అలాగే ఈ హీరోయిన్ సాయి పల్లవికి కూడా నెలకొంది అని లేడీ పవర్ స్టార్ అంటూ టాగ్ ని అందించారు.

దీనితో ఈమె క్రేజ్ మరింత స్థాయిలోకి వెళ్ళింది. అయితే ఓ సందర్భంలో తనని అలా పిలిస్తే తనకి నచ్చదు అని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడ ఈ మేటర్ సర్దుమణుగుతుంది అనుకున్నారు కానీ తాజాగా రానా హీరోగా ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం “విరాట పర్వం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి పై స్పెషల్ ఏవీ వేస్తూ అందులో లేడీ పవర్ స్టార్ అని చూపించి సినిమా మేకర్స్ షాకిచ్చారు.

దీనితో ఒక్కసారిగా ఆ విజువల్ చూసి సాయి పల్లవి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఆమె స్పీచ్ ఇస్తున్నప్పుడు కూడా లేడీ పవర్ స్టార్ అంటూ బ్యాక్గ్రౌండ్ లో వేయడం మరింత ఆసక్తిగా మారింది. పాపం సాయి పల్లవి అయితే తనకి ఇలాంటి స్టార్ స్టేటస్ ఇవ్వొద్దని చెప్తుంది కానీ ఆ క్రేజ్ ని ఆడియెన్స్ పల్స్ తో క్యాష్ చేసుకోవడమే ఫిలిం మేకర్స్ ట్రిక్స్ మరి. ఇక రాబోయే రోజుల్లో కూడా సాయి పల్లవి సినిమాల్లో ఇలాగె వేస్తారో లేదో చూడాలి.