నటి శ్యామల గురించి ఎవరికీ తెలియని నిజాలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

శ్యామల తెలుగు సినీనటి, యాంకర్. ఈమె 1989లో కాకినాడలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసమంతా హైదరాబాదులో కొనసాగింది. 2007లో టీవీ సీరియల్స్ లలో నటించే నరసింహను వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు ఇషాన్ సంతానం. శ్యామల తన కెరీర్ ను 2010లో టీవీ సీరియల్ లయ తో తన నటనను మొదలుపెట్టింది.

ఆ తరువాత వరుసగా అభిషేకం, హ్యాపీ డేస్, మా ఊరి వంట, పట్టుకుంటే పట్టు చీర లాంటి వాటిలో నటించడం మరికొన్ని ప్రోగ్రామ్ లకు యాంకర్ గా కూడా నటించడం జరిగింది. తరువాత 2014లో వచ్చిన లౌక్యం సినిమాలో సహాయ పాత్ర ద్వారా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక లైలా కోసం, గుండెలో గోదారి, ఇంటింటి అన్నమయ్య లాంటి పలు చిత్రాలలో సహాయ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.

మరొకవైపు యాంకర్ గా పలు టీవీ షోలలో చేస్తూ, ఆడియో లాంచ్ ఫంక్షన్ లు, అవార్డు ఫంక్షన్లు, కొన్ని ప్రోగ్రామ్లకు హోస్ట్ గా ముందుకు రాణిస్తుంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా కూడా వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా తన కెరీర్ తో బిజీగా గడుతూ కుటుంబంతో సంతోషంగా ఉండే సమయంలో ఈమె జీవితంలో ఒక అనవసర విషాదం చోటుచేసుకుంది.

ఆ మధ్యకాలంలో శ్యామల అంటే ఓర్వలేని వాళ్ళు కొందరు అసాంఘిక వీడియోలలో తన ఫోటోలు మార్పింగ్ చేసి తప్పుడు ప్రచారాలు చేయడంతో ఆమె చాలా మానసిక బాధను అనుభవించింది. తన భర్త ఇండస్ట్రీలో ఉన్నందున తనను అర్థం చేసుకున్నాడని, అదే వేరే వారైతే పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది.

నేను నా భర్త ఇండస్ట్రీలో కొనసాగడం వల్లనే ఒకరిని ఒకరిని అర్థం చేసుకున్నాం. సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను డిలీట్ చేయించగలిగాము. అదే హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వేయవద్దు అని పేర్కొంది.