ప్రేమ విఫలమై పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న హీరోయిన్స్ వీరే!

సినీ ఇండస్ట్రీలో ఆకర్షణకు లోనై త్వరగా ప్రేమలో పడడం, ఆ తర్వాత కొందరు కలిసి జీవిస్తే మరికొందరు కొంతకాలం తర్వాత విడిపోయి పెళ్లి కాకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి కోవకు చెందిన వారు వీరే.

టాబు: అప్పట్లో తన నటనతో మంచి గుర్తింపు పొంది, పేరు తెచ్చుకున్న టాబు ఓ హీరోతో ప్రేమాయణం నడిపి కొంతకాలం తర్వాత బ్రేకప్ చెప్పేసి 50 సంవత్సరాలు పైబడిన కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తుంది.

కౌసల్య: ఈమె అల్లుడుగారు వచ్చారు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. మలయాళం, తమిళ్ లో కూడా రాణిస్తున్న సమయంలో ఒక మలయాళ హీరో తో ప్రేమాయణం నడిపింది. ఆ హీరో కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో హీరో వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈమె మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది.

నగ్మా: ఘరానా మొగుడు చిత్రంలో చిరంజీవి సరసన నటించిన నగ్మా అందరికీ సుపరిచితమే. ఈమెకు తెలుగులోనే కాక దక్షిణాదిలోని ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. కొంతకాలం హీరోయిన్ గా రాణించి వయసు మీద పడి అవకాశాలు తగ్గడంతో రాజకీయాల వైపు చేరి ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యేగా పలుమార్లు పోటీ చేసి ఓడిపోయింది.

అయినా కూడా పట్టు వదలకుండా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాలలో పావులు కదుపుతుంది. ఇక ఈమె కూడా వివాహానికి నోచుకోలేదు అప్పట్లో క్రికెటర్ సౌరబ్ గంగూలీ తో ప్రేమాయణం నడిపింది అనే వార్తలు వినిపించాయి. వీరిద్దరి పెళ్లికి ఇరుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలుపుకపోవడంతో గంగూలీ వేరే వివాహం చేసుకున్నాడు.

నగ్మా తల్లిదండ్రులు కూడా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈమెకు పెళ్లి పై నమ్మకం పోయి ఒంటరిగానే జీవిస్తూ రాజకీయాలలో రాణించాలని ప్రయత్నాలు చేస్తుంది.