నా భర్త మరణానికి ఆ హీరోయినే కారణం.. నటి కృష్ణవేణి షాకింగ్ కామెంట్స్!

కృష్ణవేణి తెలుగు సినిమా నటి, నిర్మాత, నేపథ్య గాయని. 1924లో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించింది. 1939లో మీర్జాపురం రాజాను వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి సంతానం. కొన్ని కారణాలవల్ల రెండు సంవత్సరాలకే విడిపోవడం జరిగింది. సినిమాలలోకి రాకముందు ఈమె డ్రామా ఆర్టిస్ట్ 1936లో అనసూయ చిత్రంలో బాలనటిగా నటించింది.

వరుసగా అవకాశాలు రావడంతో చెన్నై వెళ్లిపోయింది. తమిళంలో కూడా బాగానే అవకాశాలు వచ్చాయి. ఈ తరుణంలోనే దర్శకుడు శోభన్ చంద్రాను రెండవ వివాహం చేసుకుంది ఆయనకు ఇంతకుముందే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహం తర్వాత సినిమాలను పక్కనపెట్టి కుటుంబ బాధ్యతలను చూసుకునేది. అనుకోకుండా ఓ రాత్రి రోడ్డు పక్కన భర్త శవమై కనిపించాడు. పోలీసులు యాక్సిడెంట్ అని కేస్ క్లోజ్ చేశారు.

ఇక కుటుంబ పోషణ కోసం తన భర్త స్థాపించిన శోభనచలా స్టూడియోస్ చిత్ర నిర్మాణాలలో చురుకుగా మారింది. మళ్లీ నటనలో ముందుకు కొనసాగింది. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన కన్నీటి కష్టాలను వివరిస్తూ అప్పట్లో తన భర్త వారాలబ్బాయి లాంటి మంచి మంచి సినిమాలు తీస్తూ, పైకి ఎదుగుతుంటే ఓర్వలేక కొంతమంది, ఇంకా ఒక హీరోయిన్ కలిసి కరెంటు పెట్టి, ఆ కరెంటు వైర్లతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని పేర్కొంది.

ఆ హీరోయిన్ ఎవరో పేరు చెప్పలేదు కానీ, తరువాత షుగర్ వచ్చి ఆమె చనిపోవడం జరిగింది అని తెలిపింది. ఇక తాను అమెరికాలో ఒక ఇంట్లో నాలుగు సంవత్సరాల పాటు పనిమనిషిగా ఉన్నట్లు పేర్కొంది. తర్వాత హైదరాబాదులో ఒక ఇల్లు కొని నివసిస్తున్నట్లు చెప్పింది. కూతురికి నటనపై ఆసక్తి లేకపోవడంతో వివాహం చేసి ఒంటరిగా ఉన్నానని తెలిపింది.