కోవై సరళ బ్రహ్మానందం గురించి బయటపెట్టిన షాకింగ్ నిజాలు.. తాను ఇండస్ట్రీకి దూరం కావడానికి అదేనట!

వెండితెర‌పై ఆమె న‌ట‌న‌కు ఎవ్వ‌రైనా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాల్సిందే. కామెడీ చేయ‌డంలో బ్ర‌హ్మానందంతో పోటీ ప‌డి మ‌రీ న‌టించేది. ఆమె బ్ర‌హ్మానందం క‌లిశారంటే కామెడీ వేరే లెవ‌ల్ లోనే ఉంటుంది. ఆమెనే కోవై స‌ర‌ళ‌. ఈ పేరుకు ఉన్న క్రేజ్ వేరే లెవ‌ల్‌. ఆమె త‌న కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని క‌డుపుబ్బా న‌వ్వించింది. ఇప్ప‌టి త‌రంలో లేడీ క‌మెడియ‌న్లు పెద్ద‌గా లేరు.

కానీ కోవై స‌ర‌ళ మాత్రం లేడీ బ్ర‌హ్మానందం అనిపించుకునేంత‌గా కామెడీ పండించింది.
ఇక బ్రహ్మానందం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నడంటే కారణం ఆయన కాంబినేషన్స్ అద్భుతంగా వర్క్ అవుట్ అవ్వడమే. దీనికి ఉదాహరణ లేడీ కమెడియన్ కోవై సరళ తో బ్రహ్మానందం ఎక్కువ గా సినిమాల్లో నటించే వారు.

రమాప్రభ, రాజబాబు పెయిర్ తర్వాత బ్రహ్మానందం కోవై సరళ పెయిర్ గురించి అందరు ఆసక్తిగా ఎదురు చూస్తారు. బ్రహ్మానందంతో పోటీ పడి మరి కోవై సరళ తెర పైన నవ్వులు పూయించేది. కొన్ని వందల సినిమాల్లో ఇద్దరు కలిసి నటించగా దాదాపు అన్ని సినిమాలు విజయవంతం అయ్యాయి. ఇక ఆ తర్వాత కాలంలో ఇద్దరు తమ తమ కెరీర్ ని విడివిడిగా కొనసాగించిన ప్రస్తుతం ఫేడవుట్ అయ్యారనే చెప్పుకోవాలి.

ఆమె ఉంటేచాలు కామెడీకి లోటుండ‌దు అనేంత‌గా పేరు తెచ్చుకుంది. తెలుగు, త‌మిళ స్టార్ హీరోలు కూడా ఆమెను కామెడీ కోసం పెట్టుకునేవారు. ఇలా ఆమె త‌న కామెడీ టైమింగ్ తో ఇండ‌స్ట్రీని ద‌శాబ్దాలుగా ఏలింది. దాదాపు ఎనిమిది వంద‌ల‌కు పైగా సినిమాల్లో న‌టించిన ఘ‌న‌త ఆమెకు ఉంది. త‌మిళ అమ్మాయి అయినా స‌రే తెలుగులో ఆమెకు అత్య‌ధిక సినిమాలు ఉన్నాయి.

అందుకే తెలుగులో కూడా ఆమెకు ఇంత‌గా ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఎన్నో సినిమాల్లో ఆమె న‌టించి మెప్పించింది. అయితే సినిమాల ప‌రంగా ఎలా ఉన్నా.. వ్య‌క్తిగ‌తంగా మాత్రం ఆమె చాలానే ఇబ్బందులు ప‌డింది. 59ఏండ్ల వ‌చ్చినా స‌రే ఇంకా ఒంటరిగానే జీవిస్తోంది. ఇందుకు ఆమె కుటుంబ ఆర్థిక ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని చెబ‌తారు చాలామంది. అయితే కొన్నేండ్లుగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.