సాయి పల్లవి సెన్సేషనల్ క్లారిటీ..లేడీ పవర్ స్టార్ అంటే మాత్రం..!


తెలుగు చిత్ర పరిశ్రమ దగ్గర భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో టాలీవుడ్ లో దర్శకునికి తెలుసు. ఇలా ఒక హీరోకి భారీ క్రేజ్ సొంతం అయితే అతన్ని పవన్ కళ్యాణ్ అంటారు. కానీ హీరోయిన్స్ లో అలంటి క్రేజ్ సొంతం అవ్వడంతో ఆ హీరోయిన్ ని లేడీ పవర్ స్టార్ అంటూ పిలవడం మొదలు పెట్టారు.

మరి ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు డాన్సింగ్ పీకాక్ సాయి పల్లవినే. ఈమె క్రేజ్ చూసి షాకైన టాలీవుడ్ టాప్ దర్శకుడు సుకుమార్ లేడీ పవర్ స్టార్ అని సాయి పల్లవికి ట్యాగ్ ఇవ్వగా అది పాపులర్ అయ్యి కూర్చుకుంది. అయితే మరి ఈ ట్యాగ్ సాయి పల్లవికి నచ్చిందా లేదా అనేది మాత్రం ఎవరు ఆలోచించలేదు.

కానీ సాయి పల్లవి అయితే ఈ అంశంపై తన మనసులో మాట బయట పెట్టింది. తనని ఎవరైనా లేడీ పవర్ స్టార్ అంటూ పిలిస్తే తనకి నచ్చదు అని చెప్పేసింది. అలా అంటుంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని నేను కేవలం నా వర్క్ చూసి ఆఫర్స్ ఇచ్చే వాళ్ళతో పని చెయ్యాలి అనుకుంటున్నాను..

కానీ నా స్టార్డం ను చూసి వచ్చే వాళ్ళతో కాదు అని మరో సెన్సేషనల్ క్లారిటీ ఇచ్చింది. డీసెంట్ రోల్స్ మాత్రమే తాను చేస్తానని వాటితో ఆడియెన్స్ ని మెప్పించడం మాత్రమే నా భాద్యత అని సాయి పల్లవి బిగ్ క్లారిటీ ఇచ్చింది.