చంటి అడ్డాల తెలుగు చలనచిత్ర నిర్మాత. ఆర్ట్ డైరెక్టర్, స్టోరీ రైటర్. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంటి అడవి రాముడు, అల్లరి రాముడు, తిరుమల తిరుపతి వెంకటేశ, యముడికి మొగుడు వంటి మంచి చిత్రాలను నిర్మించడం జరిగింది. చంటి ఇటీవలే కాలంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.
అందులో ఆయన చేసిన పలు సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాచి సినిమా సమయంలో చక్రి తన ఆఫీసులోనే ఉండేవాడని, చక్రి మంచి భోజన ప్రియుడని, చక్రి వ్యక్తిత్వం చాలా మంచిదని పేర్కొనడం జరిగింది. తాను మద్రాసు నుండి కొత్తగా వచ్చినప్పుడు బంజారాహిల్స్ లోని ప్రసాద్ కుటిర్ అనే అపార్ట్మెంట్లో ఉండే వాడినని పేర్కొనడం జరిగింది.
దాదాపుగా మద్రాస్ నుండి వచ్చిన ప్రముఖ స్టార్స్ ప్రసాద్ కుటీర్ లోనే ఉండేవారని పేర్కొంటూ అదే అపార్ట్మెంట్లో కూడా సౌందర్య ఉండేదని తెలిపాడు. షూటింగ్స్ అయిపోయాక సాయంత్రం గెస్ట్ హౌస్ కి వెళితే అక్కడ సౌందర్య ఫ్యామిలీ వాళ్లు బాగా పలకరించే వాళ్ళని సౌందర్య కూడా బాగా పలకరించేది ఆ పరిచయంతోనే ఆరో ప్రాణం అనే సినిమా తీయడం జరిగింది అని పేర్కొనడం జరిగింది.
రోజు సాయంత్రం గార్డెన్ లో బాగా పలకరించే అమ్మాయి ఇలా ఆక్సిడెంట్ ద్వారా చనిపోవడం తెలిసి చాలా బాధపడ్డాడని పేర్కొనడం జరిగింది. హీరోయిన్ దివ్యభారతి కూడా హైదరాబాద్ లో షూటింగ్స్ ఉంటే ప్రసాద్ కుటీర్లోనే ఒక రూమ్ తీసుకుని ఉండేదని పేర్కొనడం జరిగింది. దివ్యభారతిని హీరోయిన్ గా పెట్టి తాను కూడా రెండు చిత్రాలను నిర్మించినట్లు తెలిపాడు.
ఒకరోజు మార్నింగ్ షూటింగ్ కు టైం అవుతుందని తాను త్వరగా బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసుకొని షూటింగ్ కు బయలుదేరే సమయంలో పైనుంచి కింద పడి దివ్యభారతి చనిపోవడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఇది సూసైడో లేదా యాక్సిడెంటల్ గా జరిగిందో తెలీదు కానీ ఆ సమయంలో విషయం తెలిసి జీర్ణించుకోలేకపోయానని చంటి అడ్డాల పేర్కొనడం జరిగింది.