కీర్తి సురేష్ కు పెళ్లి అయిపోయిందంటూ ఫేక్ ఫొటోస్ వైరల్!

కీర్తి సురేష్ ఒక భారతీయ నటి. తెలుగు తమిళం మలయాళం భాషలలో నటించింది. 1992లో నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకలకు చెన్నైలో జన్మించింది. ఈమెకు ఒక అక్క ఉంది ఆమె పేరు రేవతి. 2000 సంవత్సరంలో బాలనటిగా సినీ ఇండస్ట్రీకు పరిచయమైంది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, 2013లో మలయాళం లో వచ్చిన గీతాంజలి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.

ఆ తర్వాత తమిళం మలయాళం లో నటిస్తూ తెలుగులో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ వరుసగా తమిళం, మలయాళం తెలుగులో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకవేళ సినిమాలలో రాకుండా ఉన్నట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉండే దానినని ఒక ఇంటర్వ్యూలో వివరించడం జరిగింది.

తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కమెడియన్ సతీష్ ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు సంబంధించిన కొన్ని ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో చేరాయి. ఆ ఫోటోలు చూసిన వారిలో చాలామంది వాళ్ల పెళ్లి అయిపోయిందని లేదంటే మెడలో దండలు వేసుకొని పక్కపక్కన ఎందుకు నిలుచుంటారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే నిజంగానే కమెడియన్ సతీష్, కీర్తి సురేష్ ను ప్రేమించాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు రాఖీ పండగ రోజు కీర్తి సురేష్, సతీష్ తో ఎక్కడ ఉన్నారు మీకు రాఖీ కట్టాలని ట్విట్ చేసిందంట. అందుకు సతీష్ కూడా అందరి ముందు ఇలాగే చెప్పాలి లేదంటే వేరే ఉద్దేశం అనుకుంటారు అని ట్విట్ చేశాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మొత్తానికి కమెడియన్ సతీష్ ఈ వార్త పాపులర్ కావడంతో కాస్త సంతోషంగానే ఉన్నాడని, ఒక కమెడియన్ కు హీరోయిన్ తో లవ్ అంటే ఆ మాత్రం ఉండాలి అని అనుకుంటున్నాడనే వార్తలు కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఆమె సర్కారు వారి పాట సినిమా నటించడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు ఒప్పుకొని బిజీగా ఉన్నట్లు సమాచారం.