హీరోయిన్ ఆమని అప్పట్లో సినిమాలకు దూరం అవటానికి కారణాలు ఏంటో తెలుసా?

ఆమని తెలుగు చలనచిత్ర నటిగా అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగు, తమిళం, కన్నడ భాషలలో నటించింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన 1992లో వచ్చిన జంబలకడిపంబ సినిమాలో ప్రధాన పాత్ర ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గాని నిలిచింది. ఆ తరువాత 1993లో బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం లో నటించింది. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. తర్వాత వచ్చిన శుభలగ్నం చిత్రం ద్వారా కూడా ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకుంది.

ఇలా వరుస అవకాశాలతో ముందుకు రాణిస్తూ కుటుంబ కథా చిత్రాలలో తన నటన ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు సినిమాలకు దూరం అవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. అందుకు తాను కెరీర్లో బిజీగా ఉన్నప్పుడు ఎవరు చెప్పినా పెద్దగా పట్టించుకోకుండా వివాహం చేసుకున్నాను.

కొంతకాలం తర్వాత వివాహం చేసుకొని ఉంటే బాగుండేది. పెళ్లి తర్వాత భర్త, పిల్లల బాధ్యత కోసం సినిమాలను కాస్త పక్కన పెట్టవలసి వచ్చింది అని పేర్కొనడం జరిగింది. తను సినిమాలలోకి రావడానికి తన తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని, తన తల్లి వల్లే హీరోయిన్ అయ్యానని పేర్కొనడం జరిగింది.

పెళ్లి తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండడం కాస్త ఇబ్బందిగా ఉండడంతో తన భర్త మళ్లీ సినిమాలలో నటించమని చెప్పడంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశానంది. ఇక ఆ నలుగురు చిత్రం ద్వారా సహాయ పాత్రలలో నటిస్తున్నానని పేర్కొనడం జరిగింది. తన విషయాలు అన్నీ తన తల్లి చూసుకుంటుందని, తనకు ఏ కష్టం రాకుండా అండగా ఉందని తెలిపింది.

బుల్లితెరపై ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్, వావ్ 3 వంటి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే ముత్యమంత ముగ్గు, అక్క మొగుడు, రోజా వంటి సీరియల్లలో పలు పాత్రల్లో నటించడం జరిగింది. ప్రస్తుతం ఆమె సహాయక పాత్రలో నటిస్తూ బిజీగా రాణిస్తుంది.