Amani: ఆడపిల్ల పుట్టగానే కన్నీళ్లు పెట్టుకున్న ఆమని…. ఆమె కన్నీటి గాథ అదేనా?

Amani: వెండితెరపై హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి ఆమని ఒకరు. ప్రస్తుతం ఆమని తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమని ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీ అయిన ఆమని తాజాగా కిసిక్ టాక్ షోలో పాల్గొన్నారు. జబర్దస్త్ వర్షా యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలో హాజరవుతూ వారి సినీ కెరియర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమని కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆమని తనకు కూతురు పుట్టినప్పుడు క్షణాలను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను డెలివరీ టైంలో డాక్టర్ గారు వచ్చి తనకు బేబీ గర్ల్ పుట్టింది అని చెప్పగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు వచ్చాయని తెలిపారు. అయితే ఆ కన్నీళ్లు రావడానికి కారణం నాకు కూతురు పుట్టిందనే బాధ కాదు. ఈ ప్రపంచంలో తన కుమార్తెను ఎలా రక్షించుకోవాలనే ఆలోచన నా కళ్ళల్లో భయాన్ని కన్నీటి రూపంలో బయటకు తోసింది.

ప్రస్తుతం సమాజం ఉన్నతీరును చూస్తే కనుక ఆడపిల్లలను కనాలంటే కూడా భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళల కోసం ఎన్నో ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకువచ్చారు ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై ఎక్కడో ఒకచోట అఘైత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఇలాంటి సమాజంలో ఆడపిల్లలను రక్షించుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి బాధ్యత అంటూ ఆమని అప్పటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.